Sajjala Ramakrishna reddy: మతం, మత పెద్దలపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. స్వరూపానందేంద్ర స్వామిపై వ్యాఖ్యలతో చంద్రబాబు అసలు నైజం బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న క్రిస్టియన్ మతాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu naidu) ఇప్పుడు స్వరూపానందేంద్ర స్వామిని టార్గెట్ చేసి వివాదాస్పదమయ్యారు. దేవాలయాలపై దాడుల నేపధ్యంలో డీజీపీ, హోంమంత్రి అందరూ క్రిస్టియన్లేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారి తీశాయి. ఇటీవల హిందూమత పీఠాధిపతి విశాఖ స్వరూపానందేంద్రస్వామిపై వ్యాఖ్యలతో మరో వివాదానికి తెరతీశారు. స్వరూపానందేంద్ర స్వామి( Swaroopanandendra swamy)పై చేసిన వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. చంద్రబాబు వాడిన భాష దారుణంగా ఉందన్నారు. గతంలో ఇదే స్వామీజీని  చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చాలామంది కలిశారని గుర్తు చేశారు. ఇప్పుడు కుప్పంలో ఎదురైన ఓటమితో అసహనంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు.


చంద్రబాబు మాటలు హుందాగా, సంస్కారవంతంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసుగు తొలగి అసలైన చంద్రబాబు ఇప్పుడు బయటికొస్తున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజంగా సేవ చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఎన్నుకోరని ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాగే మాట్లాడుతుంటే ఎక్కడో చోట రియాక్షన్ వస్తుందన్నారు. చంద్రబాబు చేసిన తప్పుల్ని జగన్ సరిదిద్దుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna reddy) స్పష్టం చేశారు. 


Also read: AP Mlc Elections: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook