Lokesh Zoom Meeting: లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏపీలో సంచలనం..
Lokesh Zoom Meeting: ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగిన సంచలనమే. రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు కనిపించారు
Lokesh Zoom Meeting: ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగిన సంచలనమే. రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు కనిపించారు. అది కూడా ఫైర్ బ్రాండ్ లీడర్లుగా చెప్పుకునే మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు.. నారా లోకేశ్ జూమ్ మీటింగ్ లో లాగిన్ అయ్యారు. లోకేశ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ రావడంతో అంతా షాకయ్యారు. వీళ్లిద్దరిని గమనించిన టీడీపీ నిర్వాహకులు.. మీటింగ్ ను మధ్యలోనే కట్ చేశారు.పదవ తరగతి విద్యార్థులతో నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది.ఫలితాల్లోనూ చాలా తప్పులు బయపడ్డాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కొందరు పాసైనట్లు.. ఎక్కువ మార్కులు వచ్చినా కొందరు ఫెయిల్ అయినట్లుగా ఫలితాలు వచ్చాయి. దీనిపై ఏపీలో పెద్ద రచ్చే సాగుతోంది. టెన్త్ ఫలితాలపైనే నారా లోకేష్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. స్టూడెంట్స్ తో లైవ్ లో మాట్లాడుతుంగానే సడెన్ గా కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్ లోకి వచ్చారు. దీంతో షాకయ్యారు నారా లోకేష్. వల్లభనేని వంశీ ఆఫీసులోనే కూర్చుని ల్యాప్ టాప్ ద్వారా ఓ విద్యార్థి లోకేష్ జూమ్ మీటింగ్ కు లాగిన్ అయ్యారని తెలుస్తోంది.
వల్లభనేని వంశీ ఆఫీసులోనే కూర్చుని ల్యాప్ టాప్ ద్వారా ఓ విద్యార్థి లోకేష్ జూమ్ మీటింగ్ కు లాగిన్ అయ్యారు. కార్తిక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని జూమ్ మీటింగ్ లోకి ఎంటరయ్యారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చూసే దేవెందర్ రెడ్డి కూడా లాగిన్ అయ్యారు. లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో నిర్వాహకులు లైవ్ కట్ చేశారు. వైసీపీ నేతల తీరుపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ లో కాదు డైరెక్ట్ గా మాట్లాడుతానని లోకేష్ సవాల్ చేశారు. సమావేశంలో వైసీపీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, జగన్ సర్కార్ తీరు ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని కామెంట్ చేశారు. విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతగానితనమని.. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తారా? అని లోకేష్ ఫైరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook