Gang Rape Case Update: గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల సంచలనం.. మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డుకు వినతి

Gang Rape Case Update: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈకేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు.

Written by - Srisailam | Last Updated : Jun 9, 2022, 12:24 PM IST
  • గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల సంచలనం..
  • మైనర్లను మేజర్లుగా పరిగణించాలని..
  • జూవైనల్ జస్టిస్ బోర్డుకు పోలీసుల వినతి
Gang Rape Case Update: గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల సంచలనం.. మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డుకు వినతి

Gang Rape Case Update: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈకేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత  జరిగే విచారణ సమయంలో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ కు విజ్ఞప్తి చేశారు. అమ్నేషియా పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

గ్యాంగ్ రేప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ఒక్కడే మేజర్ కాగా.. మిగిలిన ఐదుగురు మైనర్లే. మేజర్ ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు.. ఐదుగురు మైనర్లను జూవైనల్ హోంకు తరలించారు. ఇప్పుడు ఈ ఐదుగురు మైనర్లనే మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డును కోరారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీసుల వినతిపై  జువైనయల్ జస్టిస్ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్ధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకునీ జువైనల్ బోర్డు జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు. మైనర్లు వయసు 21 ఏళ్లు దాటిన తర్వాత వాళ్లను జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.

మరోవైపు మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను కస్టడీలోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్  పోలీసులు. చంచల్ గూడ జైలు నుండి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు మాలిక్ ను విచారించనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసు విచారణలో సాదుద్దీన్ నుంచి సేకరించనున్న సమాచారం కీలకం కానుంది. సీన్ రీకన్స్ట్రక్షన్  లో భాగంగా ఆమ్నేషియా పబ్, కాన్ సీ యు బేకరీ, అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని  తీసుకెళ్లనున్నారు పోలీసులు. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఇన్నోవా కారును దాచి పెట్టిన ఫాంహౌజ్ ప్రాంతానికి సాదుద్దీన్ ను తీసుకెళ్లి వివరాలు సేకరించనున్నారు. 

మరోవైపు నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లకు ప్రభుత్వ వైద్యులతో పోటెన్సీ టెస్ట్ చేయించనున్నారు పోలీసులు లైంగిక పటుత్వ నిర్ధారణ కోసంఈ టెస్ట్ చేయించనున్నారు. చార్జిషీట్ దాఖలకు ఈ పరీక్ష కీలకం కావడంతో కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. నిందితుల గత నేర చరిత్రపైనా దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఇన్నోవా కారులో సాక్ష్యధారాలు ఏమైనా తారు మారు చేశారా అన్న కోణంలోనూ తమ కస్టడీలో సాదుద్దీన్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు.

Read also: Hyderabad Police: మైనర్లు బండి నడిపితే.. జైలుకు తల్లిదండ్రులు! వక్భ్ బోర్డు చైర్మెన్ ను అరెస్ట్ చేస్తారా..?  

Read also:   VJ Sunny Attacked: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి.. షూటింగ్ స్పాట్‌లో అనూహ్య ఘటన.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News