YSRCP MLA Follower Hulchul: విశాఖ జిల్లా పెందుర్తిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అనుచరుడు మనోహర్ కత్తితో హల్‌చల్ చేశాడు. దారినపోయే ఓ జంటను ఆపి కత్తితో వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. చంపేస్తానని బెదిరించాడు. ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మనోహర్‌పై కేసు నమోదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన మౌనిక అనే హోమియో వైద్యురాలు తన భర్త శేషుతో కలిసి శుక్రవారం (ఆగస్టు 12) ఓ శుభకార్యానికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇద్దరు కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో మనోహర్ (25), కల్యాణ్ (23) మరికొందరు వ్యక్తులు ఆ జంటను తమ వాహనంలో వెంబడించారు. మౌనిక భర్త శేషు.. మనోహార్, అతని స్నేహితులపై మండిపడ్డాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ గ్యాంగ్ మౌనిక-శేషును అక్కడి నుంచి కదలనివ్వకుండా బైక్‌ను అడ్డుకున్నారు.


ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.మనోహర్ కత్తి బయటకు తీసి ఆ జంటను బెదిరించాడు. పొడిచేస్తానంటూ హెచ్చరించాడు. భర్త ముందే మౌనిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితులు మౌనిక, శేషు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనోహర్‌పై కేసు నమోదైంది.


నిందితుడు మనోహర్ స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్ అనుచరుడు కావడం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్.. ఎక్కడో ఒకచోట తప్పులు జరగడం సహజమేనని అన్నారు. తప్పు ఎవరుచేసినా తప్పేనని.. మనోహర్ చేసిన తప్పును సమర్థించట్లేదని అన్నారు. అయితే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకొస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. పోలీసులు మనోహర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. 


Also Read: Horoscope Today August 14th : నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రేమ విషయాలను మూడో వ్యక్తితో చర్చించవద్దు...  


Also Read: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook