Viral Video: ఢిల్లీలో దారుణ హత్య... నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

Delhi Brutal Murder: ఢిల్లీలో మరో దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రద్దీగా ఉండే మార్కెట్‌లో నడిరోడ్డుపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 12, 2022, 03:55 PM IST
  • ఢిల్లీలో దారుణ హత్య
  • మాళవీయ నగర్ మార్కెట్‌లో యువకుడి హత్య
  • కత్తులతో దాడి చేసిన దుండగులు
Viral Video: ఢిల్లీలో దారుణ హత్య... నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

Delhi Brutal Murder: ఢిల్లీలో దారుణ హత్య చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడిని ఓ మూక కత్తులతో పొడిచి చంపింది. రద్దీ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఈ హత్య దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన మయాంక్ (25) అనే ఓ హోటల్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్ గురువారం (ఆగస్టు 12) రాత్రి తన స్నేహితుడితో కలిసి మాళవియ నగర్‌లోని మార్కెట్‌కి వెళ్లాడు. ఆ సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు కత్తులతో మయాంక్ వద్దకు పరిగెత్తుకొచ్చారు. కొద్దిసేపు మయాంక్‌కి, ఆ గ్యాంగ్‌కి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో మయాంక్ అక్కడి నుంచి పరిగెత్తగా ఆ గ్యాంగ్ అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఆపై కత్తులతో విచక్షణారహితంగా మయాంక్‌పై దాడి చేశారు. నడిరోడ్డు పైనే మయాంక్‌పై దాడి జరిగినా.. ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మయాంక్ కాసేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

Also Read: Laal Singh Chaddha: మొదటి రోజు దారుణంగా వసూళ్లు.. ఆ జాబితాలో దక్కని చోటు!

Also Read: Raksha Bandhan 2022: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత.. చిన్ననాటి ఫోటో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News