COVID19: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కేకి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (MLA RK Tests Positive for COVID19), తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఏపీలో ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వదలడం లేదు. నిత్యం ఎవరో ఒక ఎమ్మెల్యే కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు. ఏపీలో తాజాగా ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) (MLA RK Tests Positive for COVID19), ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్ (Dadisetti Raja Tests Positive for COVID19)గా నిర్ధారించారు. Sravani Suicide Case: ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్.. దేవరాజ్‌ను వేడుకున్న శ్రావణి
కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే ఆర్కే తండ్రి దశరథరామిరెడ్డి కన్నుమూయగా.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్కే తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్19 టెస్టులలో ఎమ్మెల్యే ఆర్కేకు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే కోరారు. APPSC DL Exam Hall Tickets: వెబ్‌సైట్‌లో ‘డీఎల్’ ఎగ్జామ్ హాల్‌టికెట్స్
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం దాడిశెట్టి రాజా విశాఖకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటివరకే పలువురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. Mahesh Babu New Look: మహేష్ బాబు న్యూ లుక్ చూశారా..?
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR