Ntr Name Change: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై దుమారం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఏపీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ వర్శిటీ పేరు మార్చి మహానేతను అవమానించారని మండిపడ్డారు. అటు వైసీపీ నేతలు మాత్రం ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే జగనే ఎక్కువగా గౌరవించారని చెబుతున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని కౌంటరిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ను చంద్రబాబు దారుణంగా అవమానించారంటూ పాత చరిత్రను గుర్తు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్ సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఎన్టీఆర్ అంశంలో సంచలన కామెంట్లు చేశారు ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు  నారావారి పార్టీగా మారిందని అన్నారు. ఎన్టీఆర్ మనవళ్లూ ముందు దానిపై పోరాడాలని అనిల్ కుమార్ సూచించారు.  నందమూరి అంటే ఒక బ్రాండ్ అన్న మాజీ మంత్రి.. ఆయన మనవళ్లుగా పుట్టి ట్వీట్లు చేయడం కాదు..ఆ పార్టీని లాక్కోండి అని పిలుపిచ్చారు. తెలుగు దేశం పార్టీ మీది.. ఫస్ట్ దాని కోసం తొడలు కొట్టండి అన్నారు.  ఊరికే సౌండ్  చేయడం కాదు.. ముందు మీ తాత పార్టీని నారా నుంచి లాక్కోండి అన్నారు అనిల్ కుమార్ యాదవ్. నందమూరి వంశాన్ని చంపేశారు.. ఇప్పుడంతా నారానే ఉందని ఆయన కామెంట్ చేశారు.


Read also: CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారి కుప్పంకు జగన్.. చంద్రబాబే ఫస్ట్ టార్గెట్?


Read also: భలే స్కెచ్చేసిన మాస్ మహా రాజా.. తమిళ హీరోలకు పోటీగా రంగంలోకి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి