CM Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన రాజకీయంగా కాక రేపుతోంది. విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సమయంలో సీఎం జగన్.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ కుప్పం వెళ్లడం ఇదే సారి. దీంతో జగన్ కు గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు స్థానిక వైసీపీ నేతలు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలంతా కుప్పంలో జగన్ టూర్ ను సక్సెస్ చేసేందుకు శ్రమించారు.
కుప్పంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. మూడో విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను లబ్దిదారులకు అందిస్తారు. 45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 ఇవ్వనుంది. ఈ స్కీంకు సంబంధించి మూడో విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేస్తారు. వైఎస్ఆర్ చేయూత మూడో విడతలో 26 లక్షల ౩9 వేల 703 మంది లబ్దిదారులకు సంబంధించిన 4 వేల 949 కోట్ల రూపాయలను నేరుగా అర్హుల ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో 66 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
కుప్పంపై కొన్నిరోజులుగా ఫోకస్ చేశారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో కుప్పం సహా మొత్తం 175 సీట్లు గెలుస్తామని పదేపదే చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కుప్పం ఫస్ట్ టార్గెట్ అని ప్రకటించారు సీఎం జగన్. కుప్పంను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించిన జగన్ సర్కార్.. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో జగన్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కుప్పం వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారనే చర్చ సాగుతోంది.
Read Also: Iran: ఇరాన్ లో హిజాబ్ అంశంపై భగ్గుమన్న నిరసనలు.. ఘర్షణల్లో 31 మంది మృత్యువాత!
Read Also: OnePlus: కళ్లు చెదిరే క్యూట్‌నెస్..అద్భుత ఫీచర్లతో వన్‌ప్లస్ 10ఆర్ ప్రైమ్ లాంచ్, ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి