అసెంబ్లీలోనే అస్వస్థతకు గురైన వైసీపీ ఎమ్మెల్యే.. ఆస్పత్రికి తరలింపు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది సమాచారం మేరకు వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రక్తపోటు అధికమవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది సమాచారం మేరకు వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రక్తపోటు అధికమవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వైద్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.