MLC Karimunnisa passed away : ఏపీ అధికార పార్టీ వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా (MLC Karimunnisa) (56) శుక్రవారం రాత్రి 11.30గం. సమయంలో గుండెపోటుతో (Heart attack) కన్నుమూశారు. రాత్రి 11గం. సమయంలో కరీమున్నీసాకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కరీమున్నీసా ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం కరీమున్నీసా (MLC Karimunnisa) శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజులను కలిశారు. మండలి సమావేశానంతరం ఇంటికి చేరుకున్న కరీమున్నీసా... ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురై గుండెపోటుతో కన్నుమూశారు. ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ (CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరీమున్నీసా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు కూడా కరీమున్నీసా మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


Also Read: ఏపీలో ఇంకా 2,425 కరోనావైరస్ యాక్టివ్ కేసులు


కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన కరీమున్నీసా (MLC Karimunnisa)... ఆ తర్వాతి కాలంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో కొనసాగుతున్నారు. గతంలో ఆమె విజయవాడ కార్పోరేషన్‌లో 56వ డివిజన్ కార్పోరేటర్‌గా పనిచేశారు. 8 నెలల క్రితం కరీమున్నీసాకు సీఎం జగన్ (CM Jagan) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. ఆమె హఠాన్మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook