Vijayasai Reddy:  ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడర్లలో ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. గతంలో వైసీపీలో విజయసాయి రెడ్డే నెంబర్ టు అనే ప్రచారం సాగింది.  ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డిని సీఎం జగన్ దూరం పెట్టారనే జరిగింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం లేదు విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా ఎంపీ విజయసాయి  రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మంగళవారం తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 14 అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విశాఖ రైల్వే జోన్ కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందనే వార్తలు వచ్చాయి. విశాఖ రైల్వే జోన్ ఏపీ ప్రజల చిరకాల వాంఛ. అది జరగదని చెప్పినట్లు వచ్చిన వార్తలతో  ఏపీ ప్రజలు నిరాశకు గురయ్యారు. ఈ విషయంలో సీఎం జగన్ ను, వైసీపీని టార్గెట్ చేశాయి విపక్షాలు. జగన్ అసమర్దత వల్లే రైల్వే జోన్ రాకుండా పోతుందని ఆరోపించింది. ఈ అంశంలోనే స్పందించిన విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన చేశారు.


రైల్వే జోన్ అంశంపై వస్తున్న వార్తలు అబద్దమని చెప్పారు ఎంపీ విజయసాయి రెడ్డి. మంగళవారం జరిగిన సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదన్నారు. ఏపీ రాజధాని నుంచి కోవూరు మీదుగా తెలంగాణ కు లైన్ ఏర్పాటు పైనే చర్చ జరిగిందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు తమ వంతు పోరాటం చేశారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏపీ విభజన చట్టంలో ఉందన్న సాయి రెడ్డి..  పార్లమెంట్ లో చట్టంగా మారిన తరువాత మార్పు ఉండదని స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ ఖచ్చితంగా వస్తుందని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల సంధానకర్తగా కూడా ఉన్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని సాయి రెడ్డి చెప్పడం ఆసక్తిగా మారింది.


Also Read :  KCR NEW PARTY: కేసీఆర్ కొత్త పార్టీ రెడీ.. దసరాకి రిలీజ్? గులాబీ పార్టీలో సంబురం


Also Read :  CM Kcr: సింగరేణి కార్మికులకు శుభవార్త..దసరా కానుక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి