KCR NEW PARTY: కేసీఆర్ కొత్త పార్టీ రెడీ.. దసరాకి రిలీజ్? గులాబీ పార్టీలో సంబురం

KCR NEW PARTY:  చాలా కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Sep 28, 2022, 03:16 PM IST
  • కేసీఆర్ జాతీయ పార్టీ రెడీ
  • దసరా రోజున కేసీఆర్ ప్రకటన
  • కొత్త పార్టీ పేరుపై సస్పెన్స్
KCR NEW PARTY: కేసీఆర్ కొత్త పార్టీ రెడీ.. దసరాకి రిలీజ్? గులాబీ పార్టీలో సంబురం

 KCR NEW PARTY:  చాలా కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 5 దసరా రోజున తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీపై చర్చించి.. అందరి ఏకాభిప్రాయంతో పార్టీ పేరును కేసీఆర్ ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త జాతీయ పార్టీ ప్రకటనకు ముహుర్తం కూడా ఫిక్సైంది. విజయదశమి రోజున మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు జాతీయ పార్టీని అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించి పార్జీ జెండా, అజెండా ప్రకటిస్తారని చెబుతున్నారు.  దసరా రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినా.. మునుగోడు  ఉపఎన్నిక తరువాతే పూర్థి స్థాయిలో ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అని గతంలో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందనే ప్రచారం సాగింది. దీంతో దసరా రోజున కేసీఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ ఉంటుందా లేక మరో పేరు ఖరారు చేశారా అన్నది తెలియడం లేదు.

జాతీయ పార్టీ దిశగా కొన్నినెలలుగా కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ నినాదంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో చర్చలు జరిపారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ , ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివేసన చీఫ్ ఉద్దవ్ థాకేర్ తోనూ మాట్లాడారు. ఇటీవలే పాట్నా వెళ్లిన కేసీఆర్.. బీహార్ ముఖ్యమంత్రి నితీశీ కుమార్ తో చర్చలు జరిపారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా పలు సార్లు కేసీఆర్ తో సమావేశమై చర్చించారు. దేశ వ్యాప్తంగా తాను కలిసిన నేతల సూచనల ప్రకారమే జాతీయ పార్టీ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు.  

Also Read : Union Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..డీఏ ఎంత పెరిగిందో తెలుసా..?

Also Read : Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా చేయనున్నారా? అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News