Ysrcp walkout: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజ్యసభలో మరోసారి చర్చకొచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ(Vizag steelplant privatisation)కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కొనసాగుతోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ(Rajyasabha)లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చేదిశగా పనిచేస్తాయని చెబుతూ..విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రైవేట్ రంగ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా నడుస్తాయి కాబట్టి ప్రైవేటీకరించడం సరైంది కాదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైనింగ్ లేనందున..సంస్థకు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వైజాగ్ స్టీల్‌ప్లాంట్(Vizag Steelplant) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.


మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణపై కొంతమంది రాజీనామాలు చేయడంపై విజయసాయిరెడ్డి (Vijayasai reddy)స్పందించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి కొందరు ఉత్తుత్తి రాజీనామాలతో గంట మోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ గంటలో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు. గంట శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలైన ఉద్యమకారులకు తెలుసని చెప్పారు. 


Also read: Ap Government: పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook