YSRCP State General Secretary SV Satish Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్ కుటుంబం ఆస్తుల గొడవ పెద్ద ఎత్తున దుమారం లేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి మధ్య రాజుకున్న ఈ ఆస్తుల వివాదం, ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదాన్ని మరింత రాజేస్తూ ఇరుపక్షాలకు చెందిన వారు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆశకు కోస్తా హద్దు ఉండాలని హితవు పలికారు. వారి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పంచి ఇచ్చిన ఆస్తులను కాదని సోదరుడి ఆస్తుల్లో సైతం వాటా అడగడం సబబు కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైయస్సార్ తమ కుమార్తెకు ఆస్తులు పంచారని ఇప్పుడు అన్న సంపాదనలో భాగస్వామ్యం కోరడం అని నిలదీశారు. జగన్ తన వ్యాపారాలను చక్కదిద్దుకొని మంచి స్థాయికి ఎదిగారని, అదే సమయంలో షర్మిల సరిగా వ్యాపారాలు చేసుకోలేక నష్టపోయారని దీనికి జగన్ ఎలా బాధ్యుడు అవుతారని సతీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 


అంతేకాదు జగన్ తన ఆస్తి వాటాలో సహృదయంతో తన సోదరికి పంచి ఇచ్చారని, అయినప్పటికీ షర్మిల ఆస్తులన్నింటిని తన హక్కుగా డిమాండ్ చేయడం సమంజసమేనా అని నిలదీశారు. షేర్ల బదలాయింపు సంబంధించి బహిరంగ లేఖలు రాయడం సబబేనా అని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి దుయ్యబట్టారు. గడచిన పది సంవత్సరాలలో 200 కోట్ల ఆస్తులను తీసుకోవడమే కాకుండా, ఆస్తిలో 40% వాటా పొందినప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏమాత్రం న్యాయమని ఈ సందర్భంగా నిలదీశారు.


Also Read: Success Story: అక్షరాల 6,210 కోట్లు దానం చేసిన 87 ఏళ్ల పెద్దాయన.. వేల కోట్లు సంపాదించినా సామాన్యుడిగానే జీవితం  


షర్మిలను పావుగా చేసుకొని చంద్రబాబు నాయుడు రాజకీయం నడుపుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి నిలదీశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు తన తోబుట్టువులకు ఆస్తులు రాసిచ్చారా అని ఈ సందర్భంగా నిలదీశారు. అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా రోడ్డెక్కి నానాయాగి చేశారా... కనీసం వాళ్లను చూసినా షర్మిలమ్మ సంస్కారం నేర్చుకోవాలని సూచన చేశారు. 


ఇక అనుష్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాట అబద్ధమని కేవలం సానుభూతి డ్రామా మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టిన సంగతి మర్చిపోయి, చంద్రబాబు నాయుడు కేవలం 50 రోజులు మాత్రమే జైల్లో ఉండి సానుభూతి నాటకం చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


Also Read: Gold Rate: ఇస్రో రాకెట్ కన్న వేగంగా పెరుగుతున్న బంగారం ధర.. రూ. 1 లక్ష దాటేసిన వెండి.. ఈ రోజు ధర ఎంతంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter