Gold News: అక్టోబర్ 26 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,700 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,760 పలికింది. దీపావళి, ధంతేరస్ పండుగల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు మార్కెట్‌కు కొత్త ఊపు లభించింది.
Gold Rate: ప్రస్తుతం బంగారం ధర పాత రికార్డులన్నింటినీ బద్దలుకొడుతూ సరికొత్త గరిష్ట స్థాయిని తాకడంతో ఇన్వెస్టర్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వెండి కూడా కొండెక్కింది. వెండి ధర సైతం గణనీయంగా రూ.2,800 పెరగడంతో కిలో రూ.1,00,000 దాటింది.
ఈ ధరల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది యూరప్, అమెరికా మార్కెట్లలో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిరత యుద్ధం వంటి ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లేలా చేస్తుంది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడులుగా ఇన్వెస్టర్లు పరిగణించడం సహజమే.
దీనికి తోడు మన దేశంలో ఫెస్టివల్ సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. పండుగ సీజన్ కావడంతో బంగారం, వెండికి పెద్ద మొత్తంలో డిమాండ్ పెరుగుతుంది. సరఫరా పరిమితం అయితే, ఇది ధరలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేట్లు బంగారం, వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, ప్రజలు బంగారంపై ఇన్వెస్ట్ చేయడాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు.
సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు.
అలాగే డాలర్ విలువ పడిపోవడం కూడా పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. బంగారం ధరలు అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సుకు 2750 డాలర్లుగా ఉంది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఈ ఏడాది పండుగ సీజన్ మార్కెట్ గతంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఒక సువర్ణావకాశంగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం ఆభరణాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యం. బంగారం, వెండి ధరలు పడినప్పుడు స్వల్పంగా కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
బంగారం, వెండి ధరల పెరుగుదల ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తే, ఆభరణాల మార్కెట్ కు మాత్రం నిస్తేజాన్ని అందించాయి. ఇటువంటి పరిస్థితిలో, పండుగ సీజన్ సందర్భంగా బంగారం కొనాలంటే కచ్చితంగా నాణ్యత, తూకంపైన దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.