Byreddy Siddharth Reddy At Rayalaseema Garjana: కర్నూలు వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జనలో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తూ సిద్ధార్థ్ రెడ్డి స్పీచ్‌ను మధ్యలోనే ఆపేశారు. కళ్లు తిరుగుతున్నాయని ఒక్కసారి కింద కూర్చుండిపోయారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు బైరెడ్డికి సపర్యలు చేశారు. జ్యూస్ ఇచ్చి తాగించారు. దీంతో ఆయన వెంటనే తెరుకున్నారు. సిద్ధార్థ్ రెడ్డికి ఏమైందోనని కాసేపు అక్కడ ఒకింత ఆందోళన నెలకొనగా.. ఆయన కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అంతకుముందు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వర్షాలు కురిస్తే వజ్రాలు ఏరుకునే ప్రాంతం రాయలసీమ అని.. రాజధాని అడుగు హక్కు ఈ ప్రాంతానికే ఉందన్నారు. రాయలు ఏలిన రతనాల సీమ మా రాయలసీమ అని అన్నారు. అప్పట్లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాయలసీమకు రాజధాని ఇస్తామని చెప్పి.. కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తరలించారని గుర్తు చేశారు. 
 
'రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరాతి రైతులు భూములు ఇచ్చారు. వారిదే త్యాగం అయితే.. శ్రీశైలం ప్రాజెక్టుకు 55 వేల ఎకరాలు ఇచ్చిన మనది త్యాగమా కాదా..? రాయలసీమ వాసులందరూ ఆలోచన చేయాలి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు అవుతున్నా.. 98 జీవో ప్రకారం ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తున్నారనే ఉన్నారు. ఇక్కడ ప్రజలవి కష్టాలు కావా..? చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి. జీవో 69 తీసుకొచ్చి రాయలసీమ రైతాంగాన్ని.. జీవో 120 తీసుకొచ్చి విద్యార్థుల పొట్టకొట్టారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరి తీసుకువెళ్లారు. 


రాయలసీమ మేధావులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చించుకుండా అమరాతిని రాజధానిగా ఏర్పాటు చేసి.. ఇక్కడి ప్రజల గొంతు కోశారు. అందుకే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 52 స్థానాల్లో 49 సీట్లలో ఓడించారు. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు స్థానాల్లో కూడా ఓడిస్తారు. మాకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై నమ్మకం ఉంది. విజయవాడ, విశాఖకు సమానంతో రాయలసీమలో కూడా ఓ నగరాన్ని నిర్మించాలి..' అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కోరారు. 


కర్నూలులో రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాయల సీమ గర్జన సభ ముగిసింది. వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన ఈ సభకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరిలోనే వరుసగా శుభవార్తలు..!    


Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత యూటర్న్.. రేపు సీబీఐ విచారణకు రాలేను  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి