Zee Media launches 4 digital news channels: దేశవ్యాప్తంగా దాదాపుగా 36 కోట్ల మంది ప్రేక్షకులు కలిగి ఉన్న జీ మీడియా న్యూస్ ఇప్పుడు మన ప్రాంతీయ భాష అయిన తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది. జీ న్యూస్ తెలుగుతో పాటు దక్షిణాది భాషలైన తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్ న్యూస్ ఛానల్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నాలుగు కొత్త ప్రాంతీయ వార్తా ఛానల్స్‌ను జీ మీడియా ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డా. సుభాష్ చంద్ర వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ టీమ్‌లోని ఎడిటర్లు, ఉద్యోగులకు ఛైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మీడియా రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఛైర్మన్ డా. సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. "26 ఏళ్ల క్రితం జీ న్యూస్ అనే నేషనల్ టెలివిజన్ ఛానల్ ప్రారంభించడం జరిగింది.  దేశవ్యాప్తంగా 25 నుంచి 26 శాతం మంది ప్రజలు మా వార్తలను చూస్తున్నారు. దాదాపు 36 కోట్ల మంది జీ మీడియా వార్తలను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జీ సేవలను కొనసాగించాలని నాలో కోరిక ఉండేది. కానీ, ఇప్పుడది నెరవేరింది. సౌత్ ఇండియాలో ఉన్న నాలుగు భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) జీ మీడియా సేవలు అందించేందుకు సిద్ధమైందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను" అని పేర్కొన్నారు. 


తెలుగులో మరోసారి మీ ముందుకు..


"తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నా స్నేహితులుకు ఈ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలి. గతంలో హైదరాబాద్‌లో తెలుగు న్యూస్ ఛానల్‌ను లాంఛ్ చేయడం జరిగింది. కానీ, దాని పునర్నిర్మాణం కోసం అప్పట్లో ఆ ఛానల్‌ను ఆపేయడం జరిగింది. ఈ రోజు తెలుగుతో దక్షిణాదిలో ఉన్న మరో మూడు భాషల్లో సేవలందించేందుకు మీ ముందుకు వచ్చాం. అందుకోసం ప్రతిభావంతమైన టీమ్‌ను మేము ఎంచుకున్నాం. ఈ నాలుగు భాషల్లో ఉన్న ఎడిటర్ టీమ్‌లో మంజూష్ గోపాల్ (మలయాళం), రవి (కన్నడ), సెబీ స్టాన్లీ (తమిళం), భరత్ కుమార్ (తెలుగు) ఉన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ మాపై ఆదరాభిమానాలు ఇక ముందు కూడా కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నా. దీనితో పాటు మాకు అవసరమైన సలహాలు ఇవ్వడం సహా మాలో తప్పులు దొర్లితే సూచిస్తారని భావిస్తున్నా" అని అన్నారు.  



ఈ సందర్భంగా డా. సుభాష్ చంద్ర (Rajyasabha MP Subhash Chandra) మరికొన్ని విషయాలను ప్రజలతో పంచుకున్నారు. "మా జీ మీడియా కంపెనీ 'వసుదైవ కుటుంబం' అనే ఫిలాసఫీతో ముందుకు సాగుతోంది. దీనికి అనుగుణంగా WION అనే ఇంటర్నేషనల్ ఛానల్‌ను ప్రారంభించాం. భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమంతా ఒకటే నమ్మకంతో అతిత్వరలోనే కశ్మీర్ భాషలో సేవలు అందించేందుకు మీ ముందుకు రానున్నాం. ఇప్పుడు లాంఛ్ అవుతున్న దక్షిణాది భాషల ఛానల్స్‌ను లీడ్ చేస్తున్న పురుషోత్తమ్ వైష్ణవ్ తో పాటు నలుగురు ఎడిటర్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీపై భారీస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ మీడియా రంగంలో మీరు కొత్త బెంచ్ మార్క్‌ను సృష్టిస్తారని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. జైహింద్. జై భారత్." అని ముగించారు.  


Also Read: Zee Digital Tv: దక్షిణాది నాలుగు భాషల్లో ఘనంగా ప్రారంభమైన జీ డిజిటల్ టీవీ ప్రసారాలు


Also Read: Zee Digital Tv: జీ తెలుగు న్యూస్ డిజిటల్ ఛానెల్ ప్రారంభం... హాజరైన ఎంపీ బండి సంజయ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.