10 Seater Car Force Citiline Price and Mileage: భారత దేశంలో 7 మరియు 8 సీట్ల కార్లకు మంచి డిమాండ్ ఉంది. పెద్ద కుటుంబం ఉన్నవారు, వాణిజ్య పరంగా 7-8 సీటర్ల కార్లను ఉపయోగిస్తుంటారు. మారుతి, మహీంద్రా, టయోటా వరకు చాలా కంపెనీలు 7-8 సీటర్ల కార్లను విక్రయిస్తున్నారు. అయితే భారత మార్కెట్లోకి 10 సీట్ల కారు వచ్చింది. భారతీయ ఆటోమేకర్ బ్రాండ్ ఫోర్స్ మోటార్స్ భారతదేశంలో సిటీలైన్ రూపంలో 10 సీట్ల కారును విక్రయిస్తోంది. ఈ కారు వివరాలు ఓసారి తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోర్స్ సిటీలైన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో డ్రైవర్ కాకుండా 9 మంది కూర్చోవచ్చు. ఈ కారులో అన్ని సీట్లు ముందు వైపు ఉంటాయి. 7 సీటర్ కార్లు సాధారణంగా 3 వరుసలను కలిగి ఉండగా.. ఫోర్స్ సిటీలైన్‌లో 4 వరుసల సీట్లు ఉంటాయి. మొదటి వరుసలో 2 మంది, రెండవ వరుసలో 3 మంది, మూడవ వరుసలో 2 మంది, నాల్గవ వరుసలో 3 మంది కూర్చోవచ్చు. ఈ కారు దీని ధర రూ. 17.83 లక్షలు (ఎక్స్-షోరూమ్).


ఫోర్స్ సిటీలైన్ 2596cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 90hp మరియు 250hp టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికీ సెగ్మెంట్-బెస్ట్ లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, ఎల్బోరూమ్ మరియు షోల్డర్ రూమ్‌ను అందిస్తున్నట్లు ఫోర్స్ మోటార్స్ కంపెనీ పేర్కొంది.



ఫోర్స్ సిటీలైన్ కారులో మంచి ఫీచర్లు ఉన్నాయి. లాక్ చేయగల గ్లోవ్ బాక్స్, 4 AC వెంట్లు మరియు మాన్యువల్ AC నియంత్రణలను కలిగి ఉంటుంది. ఛార్జింగ్ కోసం 12-వోల్ట్ పవర్ సాకెట్ మరియు పవర్ స్టీరింగ్ ఉన్నాయి. 4 పవర్ విండోలు, సెంటర్ కన్సోల్‌ ఇందులో ఇవ్వబడ్డాయి. విశేషమేమిటంటే 2వ వరుసలో కూడా 4 ఏసీ వెంట్లు ఇచ్చారు. ఇవి కారు పైకప్పులో ఉంటాయి.


Also Read: Mahindra Thar Offer 2023: మహీంద్రా థార్‌పై బంపర్ ఆఫర్‌లు.. రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు! 6 రోజులు మాత్రమే  


Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ కెరీర్‌ చివరి దశకు చేరుకుంది.. సాయం చేయడానికి సిద్ధం: మ్యాథ్యూ హేడెన్‌  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.