Toyota Hyryder Waiting Period: మార్కెట్‌లో Toyota Hyryderకి ఫుల్ డిమాండ్.. డెలివరీకి 20 నెలలు ఆగాల్సిందే!
2023 Toyota Urban Cruiser Hyryder waiting Period: టయోటా హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ 20 నెలల వరకు ఉంది. పెట్రోల్ వేరియంట్‌ల కోసం అయితే 7 నెలల వరకు ఉంటుంది.
Full Demand for Toyota Urban Cruiser Hyryder: టయోటా కంపెనీ తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను సెప్టెంబర్ 2022లో విడుదల చేసింది. ఈ ఆకృ పెట్రోల్ మరియు పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. టయోటా హైరైడర్ సుజుకి సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఎంపికను కూడా కలిగి ఉంది. మార్కెట్‌లో ఈ ఎస్‌యూవీలకు చాలా డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం... టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ 20 నెలల వరకు ఉంది. ఎస్‌యూవీ యొక్క పెట్రోల్ వేరియంట్‌ల కోసం అయితే వెయిటింగ్ పీరియడ్ 7 నెలల వరకు ఉంటుంది. అంటే ఈ కారుకి ఎంత డిమాండ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
టయోటా హైరైడర్ యొక్క హైబ్రిడ్ వేరియంట్ 1.5-లీటర్ 3-సిలిండర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 92bhp శక్తిని మరియు 122Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు eCVT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 79bhp పవర్ మరియు 141Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ యొక్క కంబైన్డ్ పవర్ 114bhp వద్ద ఉంటుంది. ఇది 0.76kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ కారు 27.97kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ ఓ పేర్కొంది.
హైరైడర్ యొక్క రెగ్యులర్ వెర్షన్ 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్రెజాకు కూడా శక్తిని ఇస్తుంది. ఈ ఇంజన్ 103PS పవర్ మరియు 137Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ను కలిగి ఉంటుంది. టాప్-స్పెక్ మాన్యువల్ వేరియంట్ AWD (ఆల్-వీల్-డ్రైవ్) సిస్టమ్ ఎంపికను కూడా కలిగి ఉంది. హైరైడర్ మాన్యువల్ 21.11kmpl మైలేజీని ఇస్తుంది. ఇక AWD వేరియంట్ 19.38kmpl మైలేజీని ఇస్తుంది.
ఇన్నోవా హైక్రాస్‌కు కూడా అధిక డిమాండ్ ఉంది. ఈ కారు డెలివరీల కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియా నివేదికల ప్రకారం.. ఇన్నోవా హైక్రాస్ కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు 26 నెలలు (2 సంవత్సరాలు). ఇది కాకుండా టయోటా ఇటీవల విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా డీజిల్‌కు దాదాపు 16 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది.
Also Read: 2023 Discontinued Cars: ఒకే ఒక్క నియమం.. నిలిపివేయబడిన 14 కార్ మోడల్స్! పూర్తి జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి