2023's Discontinued Cars: కేవలం ఒకే ఒక్క నియమం వల్ల నిలిపివేయబడిన 14 కార్ మోడల్స్ ఇవే!

Discontinued list of Cars in 2023 After BS6 P2 Norms. ఐసీఈ కార్ల కోసం BS6 ఫేజ్-2 అమలు చేయబడింది. BS6 ఫేజ్-2 యొక్క ఉద్గార నిబంధనల ప్రకారం లేని 14 కార్లు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి.

Written by - P Sampath Kumar | Last Updated : Apr 12, 2023, 07:07 PM IST
  • ఒకే ఒక్క నియమం
  • 14 కార్ మోడల్స్ ఔట్
  • నిలిపివేయబడిన పూర్తి జాబితా ఇదే
2023's Discontinued Cars: కేవలం ఒకే ఒక్క నియమం వల్ల నిలిపివేయబడిన 14 కార్ మోడల్స్ ఇవే!

14 Indian Cars Discontinued in 2023 due to BS6 P2 Norms: భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో 'కార్బన్ డయాక్సెడ్'ను తగ్గించడానికి నిత్యం కసరత్తులు జరుగుతున్నాయి. దీని కోసం ఉద్గార ప్రమాణాలు అమలు చేయబడ్డాయి. BS6 ఫేజ్ IIలో ఉద్గార నిబంధనలు మరింతగా బలోపేతం చేయబడ్డాయి. ఇది కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు (EV)లపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. తక్కువ కాలుష్యం కారణంగా ఈవీలకు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు ఐసీఈ కార్ల కోసం BS6 ఫేజ్-2 అమలు చేయబడింది. BS6 ఫేజ్-2 యొక్క ఉద్గార నిబంధనల ప్రకారం లేని చాలా కార్లు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి.

BS6 ఫేజ్-2 యొక్క ఉద్గార నిబంధనల ప్రకారం లేని (Discontinued Cars 2023) దాదాపుగా14 కార్లు నిలిపివేయబడ్డాయి. హ్యుందాయ్, రెనాల్ట్, మహీంద్రా, హోండా, నిస్సాన్, టొయోట, స్కోడా కంపెనీలను చెందిన కార్లు ఉన్నాయి. మారుతీ సుజుకి ఆల్టో 800, రెనాల్ట్ క్విడ్ 800సీసీ, మహీంద్రా KUV100, హోండా జాజ్, హ్యుందాయ్ ఐ20 డీజిల్, హోండా అమేజ్ డీజిల్, హోండా WR-V, హోండా సిటీ 4 జెన్, నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ వెర్నా డీజిల్, హోండా సిటీ 5 జెన్ డీజిల్, టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్, స్కోడా ఆక్టేవియా, స్కోడా సూపర్బ్ కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

నిలిపివేయబడిన మోడళ్లలో ఎక్కువగా హోండా కంపెనీవే ఉన్నాయి. జపాన్ తయారీదారు అయిన హోండా నుంచి 5 మోడల్‌లు నిలిపివేయబడ్డాయి. జాజ్, సిటీ 4వ జెన్ మరియు WR-V క్రాసోవర్ పూర్తిగా నిలిపివేయబడ్డాయి. అదే సమయంలో హోండా సిటీ 5వ జెన్ మరియు అమేజ్ యొక్క డీజిల్ పవర్‌ట్రెయిన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు ఈ రెండు కార్లు డీజిల్ ఇంజిన్ ఎంపిక ఉండదు. ఇటీవలి కాలంలో కాంపాక్ట్ మరియు సబ్-కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ స్పేస్‌లో డీజిల్ యొక్క ప్రజాదరణ తగ్గిందని తెల్సిన విషయమే.

Also Read: మార్కెట్‌లో అలజడి సృష్టించడానికి వచ్చిన లావా బ్లేజ్ 2.. డిజైన్, ఫీచర్స్ అదుర్స్! 10వేల కంటే తక్కువ

Discontinued Cars in India 2023:
# Maruti Suzuki Alto 800 
# Renault Kwid 800cc
# Mahindra KUV100
# Honda Jazz 
# Hyundai i20 Diesel 
# Honda Amaze Diesel 
# Honda WR-V 
# Honda City 4th Generation 
# Nissan Kicks 
# Hyundai Verna Diesel 
# Honda City 5th Generation Diesel 
# Toyota Innova Crysta Petrol 
# Skoda Octavia 
# Skoda superb

Also Read: Hyundai Creta Price 2023: కేవలం 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు! లిమిటెడ్ కార్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News