Petrol Diesel Update: వాహనదారులకు గుడ్ న్యూస్- 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందండి!
Petrol Diesel Update: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మీరు సతమతవుతున్నారా? అయితే మీ కోసం ఓ బంపర్ ఆఫర్! పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలులో డబ్బును ఆదా చేసుకోవడం సహా 50 లీటర్ల ఇంధనం ఉచితంగా పొందే ఉపాయం ఉంది. అదేంటో తెలుసుకోండి.
Petrol Diesel Update: పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో పెరిగిన కారణంగా ద్రవ్యోల్బణాన్ని పెరిగిపోయింది. దీని వల్ల రవాణా ఖర్చుపై ప్రభావం పడుతోంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత కూడా పెట్రోల్- డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే మీకు ఓ 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఉచితంగా పొందే సూపర్ ఐడియాను చెప్పబోతున్నాం. ఆ బంపర్ ఆఫర్ ఏంటో మీరే తెలుసుకోండి.
50 లీటర్ల ఇంధనం ఉచితం
దేశంలో ఇంధన ధరలు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనదారులను ఆకర్షించేందుకు అనేక పెట్రోల్ బంకులు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వీటితో పాటు పలు బ్యాంకులు కూడా బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. వారి వారి క్రెడిట్ కార్డులు వినియోగించి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
అదే కోవలో HDFC బ్యాంకు కూడా తమ క్రెడిట్ కార్డు వినియోగించే వారికి ఊరట కల్పించింది. Indian Oil HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగిన వారు పెద్ద మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు. మీ దగ్గర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులకు వెళ్లి 'ఫ్యూయల్ పాయింట్స్' రూపంలో రివార్డు పాయింట్లను పొందుతారు.
అదే విధంగా మీ దగ్గర ఉన్న Indian Oil HDFC క్రెడిట్ కార్డుతో డబ్బు చెల్లిస్తే 5% డిస్కౌంట్ లభిస్తోంది. వీటి ద్వారా వచ్చే ఫ్యూయిల్ పాయింట్స్ ద్వారా ఏటా మీకు 50 లీటర్ల ఇంధనం (పెట్రోల్ లేదా డీజిల్) ఉచితంగా లభించినట్లు అవుతుంది.
ఈ కార్డు ప్రత్యేకతలు
1) Indian Oil HDFC క్రెడిట్ కార్డు ద్వారా ఇంధనాన్ని కొనుగోలు చేసేటప్పుడు.. మీరు ఖర్చు చేసే డబ్బులో 5 శాతం ఇంధన పాయింట్ల రూపంలో పొందుతారు.
2) మీరు మొదటి 6 నెలలకు ప్రతి నెల గరిష్టంగా 50 ఇంధన పాయింట్లను పొందుతారు.
3) అయితే, 6 నెలల తర్వాత మీరు గరిష్టంగా 150 ఇంధన పాయింట్లను పొందవచ్చు.
4) ఈ కార్డు ద్వారా కిరాణా, అనేక బిల్లు చెల్లింపులపై కూడా మీరు 5 శాతం ఇంధన పాయింట్లను పొందుతారు.
5) అంటే, ఈ రెండు కేటగిరీల ద్వారా మీరు ప్రతి నెల గరిష్టంగా 100 ఇంధన పాయింట్లను పొందవచ్చు.
6) వీటితో పాటు ఇతర కేటగిరీలలో ప్రతి రూ.150 ఖర్చుపై 1 ఇంధన పాయింట్‌ను పొందుతారు.
7) పెట్రోల్ పంపుల వద్ద, ఈ కార్డుతో కనీసం రూ.400 ఇంధన కొనుగోలుపై మీరు 1% ఫ్యూయల్ సర్‌ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
8) ఒక బిల్లింగ్ లో గరిష్టంగా రూ.250 వరకు ఇంధన సర్‌ఛార్జ్‌ను మాఫీ చేయవచ్చు.
ఈ కార్డు వార్షిక రుసుము?
Indian Oil HDFC క్రెడిట్ కార్డు పొందాలంటే రూ.500 వార్షిక రుసుము (ప్రతి ఏటా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డును పొందేందుకు మీ దగ్గర్లోని HDFC బ్యాంకు లేదా ఆ బ్యాంకుకు సంబంధించిన వెబ్ సైట్ hdfcbank.comలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా
Also Read: Vodafone Idea stake : ప్రభుత్వ ఆధీనంలోకి వొడాఫోన్ ఐడియా కంపెనీ, మేజర్ వాటా దక్కించుకున్న సర్కార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి