DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటే
DA Hike Announcement: 7వ వేతన సంఘం డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. దసరా, దీపావళికి ముందే డీఏ పెంపు నజరానా లభించనుంది. పెరిగిన డీఏ ఎరియర్లతో పాటు రానుండటంతో జీతం పెద్దమొత్తంలో తీసుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.
DA Hike Announcement: ఈసారి దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారనుంది. దంతేరాస్‌కు ముందే ఇంటికి లక్ష్మి రానుంది. రేపు డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. అదే జరిగితే అక్టోబర్ నెల జీతం భారీగా చేతికి అందనుంది. డీఏ పెంపుతో పాటు ఎరియర్లు కూడా రానున్నాయి. అక్టోబర్ నెల జీతం పెద్దమొత్తంలో అందుకోనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు జూలై నుంచి అమలు కావల్సి ఉంటుంది. డీఏ 3 శాతం పెంచవచ్చని దాదాపుగా ఖరారైంది. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 శాతం డీఏ పొందుతున్నారు. దీనికి 3 శాతం చేర్చినా అది కాస్తా 53 శాతం అవుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఎరియర్లతో పాటు అక్టోబర్ డీఏ కూడా కలిపి అందుకోనున్నారు. ఉద్యోగుల కేటగరీని బట్టి డీఏ వేర్వేరుగా పెంపు ఉంటుంది. ఉద్యోగుల బేసిక్ శాలరీ ఆధారంగా ఎవరికి ఎంత డీఏ అనేది ఉంటుంది. డీఏ పెంపు ప్రభావం నేరుగా జీతంపై పడుతుంది. పెరిగిన డీఏ ఎంత ఉంటుందనేది చెక్ చేద్దాం..
బేసిక్ శాలరీ 56,900 రూపాయలుంటే డీఏ 53 శాతం చొప్పున మొత్తం డీఏ 30,157 రూపాయలు అవుతుంది. అదే ఏడాదికి అయితే 3,61,884 రూపాయలు ఉంటుంది. అంటే బేసిక్ శాలరీ 56 వేలు ఉండే ఉద్యోగులకు ఏడాదికి ఏకంగా 3 లక్షల 61 వేల రూపాయలు కేవలం డీఏ రూపంలో వస్తుంది. డీఏ 3 శాతం పెంపుతో మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అక్టోబర్ నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా దీపావళి తీసుకురానుంది.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.