7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జూలై నెల డీఏ పెంపు ప్రకటన రేపు అంటే అక్టోబర్ 9న వెలువడవచ్చు. కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా, దీపావళి నజరానా లభించనుంది. డీఏ ఎరియర్లతో పాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. డీఏ ఎంత పెరగనుంది, బోనస్ ఎంత రావచ్చనేది చూద్దాం.
దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది. కేంద్ర ప్రభుత్వం రేపు బుధవారం డీఏ పెంపుపై ప్రకటన జారీ చేయనుందని తెలుస్తోంది. ఈసారి డీఏ 3-4 శాతం మధ్య ఉండవచ్చు. అంటే మొత్తం డీఏ 50 నుంచి 53 లేదా 54 శాతానికి చేరుకోవచ్చు. మార్చ్ నెలలో 4 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. ఇప్పుడు జూలై నెల డీఏ ఎరియర్లతో సహా ఈ నెలలో అందనుంది. అంతేకాకుండా ఈ నెలలో దీపావళి బోనస్ కూడా ఉంటుంది. దాంతో ఉద్యోగులు భారీగానే జీతం అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చాలా ముఖ్యమైంది. 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదిలో రెండుసార్లు ఉంటుంది. జనవరి, జూలై నెలల్లో ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారణంగా నిర్ణయిస్తుంటారు. డీఏ ఒకవేళ 3 శాతం పెరిగితే బేసిక్ శాలరీ 18 వేలున్నవారికి డీఏ 9 వేల నుంచి 9 వేల 540 రూపాయలు పెరుగుతుంది. అదే 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 9,720 రూపాయలు అవుతుంది.
అక్టోబర్ నెలలో డీఏ పెంపుతో ఉద్యోగులకు చాలా రిలీఫ్ కలగనుంది. ఎందుకంటే దసరా, దీపావళి రెండు పండుగలున్నాయి. ఈ సమయంలో అటు డీఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కూడా వస్తే ఇక అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. ఈ నెల జీతం భారీగా అందుకుంటారు. మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చలు నడుస్తున్నాయి. 7వ వేతన సంఘం 2016లో ఏర్పడింది. ఇది 2026 వరకూ అమల్లో ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తే అమల్లో వచ్చేటప్పటికి 2026 కావచ్చు. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి కోరుతున్నాయి. ప్రస్తుతం డీఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు.
Also read: Haryana JK Results 2024: జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యం, హర్యానాలో హోరాహోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.