DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపుకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. దాదాపు 2,3 నెలలుగా ఉద్యోగులు డీఏ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొదటి డీఏని మార్చిలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెండో డీఏని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. జూలై, ఆగస్టులోనే దీనిపై ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా డీఏ పెంపు ప్రకటనపై కీలక అప్‌డేట్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీఏ పెంపుపై ప్రకటన ఆరోజునే :


సెప్టెంబర్‌లో డీఏ పెంపు ఉండొచ్చునని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఉండొచ్చునని తెలుస్తోంది. నవరాత్రుల మూడో రోజైన సెప్టెంబర్ 28న డీఏ పెంపుపై ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. 


డీఏ పెంపు ఎంత ఉంటుంది :


ఈ ఏడాది మార్చిలో కేంద్రం 3 శాతం డీఏ పెంపు ప్రకటించింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతానికి చేరింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఈసారి డీఏ పెంపు మరో 4 శాతం ఉండొచ్చుననే అంచనాలు నెలకొన్నాయి. అదే జరిగితే డీఏ 38 శాతం వరకు పెరుగుతుంది. సాధారణంగా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా కేంద్రం డీఏ పెంపు ప్రకటిస్తుంది. ఈ ఏడాది జూన్ మాసానికి ఏఐసీపీఐ ఇండెక్స్ 129.2 పాయింట్లుగా ఉంది. కొద్ది నెలలుగా ఏఐసీపీఐ ట్రెండ్ గమనిస్తే క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


డీఏ ఏరియర్స్ ఎప్పుడు :


డీఏ పెంపు ప్రకటనతో పాటు కరోనా కాలంలో 18 నెలల కాలానికి నిలిచిపోయిన డీఏ చెల్లింపులను కూడా కేంద్రం ఈసారి చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకేసారి ఆ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లయితే దసరా పండగ ముందు ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపినట్లే. అయితే పెరిగిన డీఏతో పాటు డీఏ ఏరియర్స్‌ను సెప్టెంబర్‌ నెల వేతనంతో పాటే కేంద్రం చెల్లిస్తుందా లేక మరికొంత కాలం ఉద్యోగులు నిరీక్షించేలా చేస్తుందా వేచి చూడాలి.


Also Read: Ranga Ranga Vaibhavanga Review: 'రంగ రంగ వైభవంగా' టైటిల్ కు తగినట్టుగానే ఉందా?


Also Read: Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook