Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు..

Gas Cylinder Loaded Lorry Exploded: ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి పెను ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి సిలిండర్లు పేలిపోయాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 2, 2022, 08:35 AM IST
  • ప్రకాశం జిల్లాలో ర్ధరాత్రి పెను ప్రమాదం
  • పేలిపోయిన గ్యాస్ సిలిండర్ల లారీ
  • ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం
Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు..

Gas Cylinder Loaded Lorry Exploded: ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిలిండర్లు పేలిపోయాయి. దాదాపు 100కి పైగా సిలిండర్లు పేలిపోయినట్లు తెలుస్తోంది. భారీ శబ్ధాలతో సిలిండర్లు పేలిపోవడంతో సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అటువైపు రాకపోకలు నిలిపివేశారు. ప్రకాశం జిల్లా అనంతపురం-గుంటూరు హైవేపై దద్దవాడ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు దాదాపు 300 సిలిండర్ల లోడ్‌తో ఒక లారీ బయలుదేరింది. గురువారం అర్ధరాత్రి దాటాక లారీ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. లారీని రోడ్డు పైనే నిలిపివేసి అందులో నుంచి తప్పించుకున్నాడు.

క్షణాల్లో మంటలు లారీ మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న 300 సిలిండర్లలో దాదాపు 100 సిలిండర్లు పేలిపోయాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు జాతీయ రహదారిపై అటు, ఇటు రెండువైపులా రాకపోకలు నిలిపివేశారు. సుమారు అర కి.మీ దూరంలోనే వాహనాలన్నింటిని నిలిపివేశారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న దద్దవాడలో 30 ఇళ్లను ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో దద్దవాడ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: Horoscope Today September 2nd 2022: నేటి రాశి ఫలాలు... ఈ రెండు రాశుల వారిని ఇవాళ అసంతృప్తి వెంటాడుతుంది

Also Read: INS Vikrant: భారత అమ్ముల పొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. నేడు నావిక దళానికి అప్పగించనున్న ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News