TA Hike Central Govt Employees: డీఏ పెంపు తర్వాత ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ గిఫ్ట్ ఇచ్చింది. ఇటీవల డీఏను పెంచగా.. తాజాగా ట్రావెల్ అలవెన్స్ (టీఏ) కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. డీఏ పెంచినప్పుడే ఉద్యోగుల టీఏ కూడా పెరిగింది. కానీ ఇప్పుడు ట్రావెలింగ్ గ్రేడ్ పెరిగింది. దీంతో రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్‌తో పాటు కేంద్ర ఉద్యోగులకు ఇప్పుడు తేజస్ రైలులో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఇటీవల కరువు భత్యాన్ని 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఉద్యోగుల మొత్తం 38 శాతానికి పెరగడంతో డీఏ పెంపు ప్రభావం టీఏపై కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణ భత్యం ఇలా..


ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం (DoE) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులు తమ అధికారిక పర్యటనలో తేజస్ రైలులో ప్రయాణించవచ్చు. అధికారులు తమ అధికారిక ప్రయాణ ప్రణాళికల కోసం ఈ రైలును ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్, ప్రీమియం క్లాస్ రైలు. ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన తాజా ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రైలులో అధికారిక కార్యాకలపాల నిమిత్తం ప్రయాణం చేయవచ్చు.


టీఏ గణన ఇలా..


పే మ్యాట్రిక్స్ స్థాయి ఆధారంగా ప్రయాణ భత్యం 3 వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం-అధిక రవాణా భత్యం నగరానికి చెందినది. దీని కోసం టీఏ గణన సూత్రం మొత్తం రవాణా భత్యం = టీఏ+[(టీఏx డీఏ %)/100]. టీపీటీఏ 1-2కి రూ.1350, 3-8 స్థాయి ఉద్యోగులకు రూ.3600, తొమ్మిది స్థాయిలకు పైబడిన వారికి 7200 రూపాయల టీఏ లభించనుంది. 9వ స్థాయి,  అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులు అధిక రవాణా భత్యం ఉన్న నగరాలకు రూ.7,200 TA+DA పొందుతారు. 


ఇతర నగరాలకు ఈ భత్యం రూ.3,600+DA. అదే సమయంలో 3-8 స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు 3,600 ప్లస్ DA, 1,800 ప్లస్ DA, లెవల్ 1, 2 స్థాయి ఉద్యోగులకు ఫస్ట్ క్లాస్ నగరాలకు రూ.1,350 +DA, ఇతర నగరాలకు అయితే రూ.900+DA పొందుతారు. క్యాబినెట్ సెక్రటరీ స్థాయి అధికారులకు  కారు సౌకర్యం ఉండడంతో నెలకు రూ.15,750+డీఏను ప్రభుత్వం చెల్లిస్తుంది. పే గ్రేడ్ 14, అంతకంటే ఎక్కువ పే గ్రేడ్ ఉన్న ఉద్యోగులకు కారు సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.


Also Read: Fuel Prices Cut Down: గుడ్‌న్యూస్, పెట్రోల్-డీజిల్ లీటర్‌కు 14 రూపాయలు తగ్గనుందా


Also Read: Shraddha Murder Case: ఫ్రిజ్‌లో మృతదేహం ఉందని తెలియదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన అఫ్తాబ్ గర్ల్‌ఫ్రెండ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి