7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఫిట్‌మెంట్‌పై త్వరలో కీలక ప్రకటన
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్‌మెంట్ విషయంలో ఆశించిన కీలక ప్రకటన వెలువడనుంది. ఫలితంగా కనీస వేతనం పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్‌మెంట్ విషయంలో ఆశించిన కీలక ప్రకటన వెలువడనుంది. ఫలితంగా కనీస వేతనం పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం త్వరలో ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేయనుంది. ఫిట్‌మెంట్ పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైంది. జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం ముసాయిదా ప్రవేశపెట్టిన తరువాత జూలై నెలాఖరుకు ఈ అంశంపై భేటీ జరగనుంది. దీనిపై పరస్పరం అంగీకారమైతే 52 లక్షలకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కనీస వేతనం పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 ఆగస్టు 1 నుంచి కరవు భత్యం అమలు కావచ్చు. ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం ఆగస్టు 1 2022 నుంచి డీఏ 4-5 శాతం పెరగవచ్చు. అంటే 38-39 శాతం చేరుకోవచ్చు. మే వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ వివరాలు వచ్చేశాయి. జూన్ గణాంకాల తరువాత ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయవచ్చు.ఈలోగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రభుత్వం నుంచి ఆమోదం లభించవచ్చు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం,పెన్షన్ కూడా పెరగనున్నాయి.
7వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో నిర్ణయమౌతుంది. ఫిట్‌మెంట్ పెరిగితే కనీస వేతనంలో పెరుగుదల ఉంటుంది. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రెండున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు ఉంటుంది. దీని ఆధారంగా కనీస వేతనం 18 వేలు కాగా..అత్యధికంగా 56 వేల 9 వందల రూపాయలుంది.
Also read: Sukanya samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజనలో కొత్త మార్పులు తెలుసుకున్నారా..మరిన్ని వెసులుబాట్లు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook