7th Pay Commission Latest News: Central Govt Employees will get 4 percent DA Hike on 2023 March: మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా మీ కుటుంబంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా.. ఈ వార్త మిమ్మల్ని కచ్చితంగా సంతోషపరుస్తుంది. కొత్త సంవత్సరం 2023లో హోలీకి ముందు కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను 2023 జనవరిలో 4 శాతం పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి రెండుసార్లు (జనవరి మరియు జూలై మాసంలో) డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతంగా ఉంది. జనవరిలో 4 శాతం పెంపుతో.. 42 శాతానికి పెరగనుంది. అయితే జనవరిలో పెంచిన డీఏను మార్చిలో ప్రకటించనున్నారు. మార్చి మొదటి వారంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు కొత్త సంవత్సరంలో ఉద్యోగుల ఫిట్‌మెంట్ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ముసాయిదాను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ ముసాయిదాలో ఫిట్‌మెంట్ కారకం యొక్క పునర్విమర్శపై మాట్లాడే అవకాశం ఉంది. పే కమిషన్ ఏర్పాటుపై ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సవరణ జరుగుతుంది. కానీ ఈసారి పే కమీషన్ కాకుండా మరో పద్దతి ఉపదయోగించనుందట. బహుశా ప్రభుత్వం ఆటోమేటిక్ పే రివిజన్ కోసం ఒక ఫార్ములా తయారు చేయాలి.


హోలీకి ముందు కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ అందుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2023 మార్చి 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి మార్చి 1 బుధవారం, తదుపరి బుధవారం మార్చి 8. మార్చి 8న హోలీ పండగ నేపథ్యంలో ఉద్యోగులకు ముందే డీఏ పెంపు బహుమతిని ఇవ్వనుంది. ఆ డీఏ పెంపులో 4 శాతం పెరిగే అవకాశం ఉంది.


Also Read: Shukra Gochar 2023: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!


Also Read: Dok-1 Max Cough Syrup: భారత దగ్గు మందుతో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.