Dok-1 Max Cough Syrup: భారత దగ్గు మందుతో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ!

18 childrens deaths in Uzbekistan linked to cough syrup made in India. భారత్‌లో తయారైన దగ్గు మందు డోక్-1 మ్యాక్స్ తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 29, 2022, 12:18 PM IST
  • భారత దగ్గు మందుతో 18 మంది పిల్లలు మృతి
  • విచారణ ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ
  • వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా
Dok-1 Max Cough Syrup: భారత దగ్గు మందుతో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ!

18 childrens dies in Uzbekistan due to India made cough syrup Dok-1 Max: భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు చేసింది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ 'డోక్-1 మ్యాక్స్' (Dok 1 Max) తాగి పిల్లలు చనిపోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. డోక్-1 మ్యాక్స్ సిరప్ మరియు మాత్రలు దగ్గు-జలుబు నివారణ కోసం వాడే మందులు. గాంబియా దేశంలో భారత దగ్గు మందు విషయం (70 మంది పిల్లలు మృతి) మరవక ముందే.. ఉజ్బెకిస్తాన్ కూడా అలాంటి ఆరోపణలే చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. 

డోక్-1 మ్యాక్స్ సిరప్‌లో విషపూరిత పదార్థం 'ఇథిలిన్ గ్లైకాల్' ఉన్నట్లు తమ ప్రయోగశాల పరీక్షలలో తేలినట్లు ఉజ్బెకిస్తాన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా.. ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు పిల్లలకు వారి తల్లిదండ్రులు దగ్గు మందు ఇచ్చారని తెలిపింది. అంతేకాదు పిల్లలకు ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ మోతాదులతో సిరప్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2 నుంచి 7 రోజుల పాటు 2.5 నుంచి 5 ఎంఎల్ మోతాదులో రోజుకు 3 నుంచి 4 సార్లు పిల్లలు తీసుకున్నట్లు వెల్లడించింది. దగ్గు, జలుబు నివారణకు తల్లిదండ్రులు ఈ సిరప్ వాడారట. 

ఈ ఘటన అనంతరం డోక్ 1 యొక్క అన్ని మాత్రలు మరియు దగ్గు సిరప్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం అక్కడి అధికారులను ఆదేశించింది. దీనికి కారణంగా భావిస్తున్న ఏడుగురు ఉద్యోగులను వేంటనే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపింది. మరణాలపై మరిన్ని వివరాలను తెలపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వంను కోరింది.  ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సదరు కంపెనీపై విచారణ ప్రారంభించాయి. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దగ్గు సిరప్‌లలో ఇథిలీన్ గ్లైకాల్ జాడలు కూడా ఉండకూడదట. యునైటెడ్ కింగ్‌డమ్, జార్జియా, నైజీరియా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అజర్‌బైజాన్, కెన్యా, ఇథియోపియా, శ్రీలంక, మయన్మార్, లావోస్ మరియు వియత్నాంలకు కూడా డాక్ 1 తయారీదారు మారియన్ బయోటెక్ సంస్థ మందులను ఎగుమతి చేస్తుంది. ఈ ఘటనతో డాక్ 1 సంస్థపై పెను ప్రభావం పడనుంది. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణంగా ఆఫ్రికా దేశం గాంబియాలో కూడా 70 మంది పిల్లలు మరణించారు. 

Also Read: Shukra Gochar 2023: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!

Also Read: Venus Transit 2023: 2023 ఆరంభంలో అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి భారీగా పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News