7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ముమ్మాటికీ గుడ్‌న్యూస్. కరవు భత్యం అంటే డీఏ మరోసారి పెరగనుంది. ఇటీవల వారం రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. 34 శాతం ఉన్న డీఏ 38 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుందని తెలుస్తోంది. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 28న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచుతూ నిర్ణయం వెలువడటమే కాకుండా మూడు నెలల ఎరియర్స్‌తో పాటు చెల్లింపు కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుందని తెలుస్తోంది. ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చు. ఏఐసీపీఐ నివేదిక ద్వారా ఈ విషయం స్పష్టమైంది. 


ఏఐసీపీఐ నివేదిక ఏం చెబుతోంది


కార్మిక శాఖ ద్వారా ఆగస్టు నెలవరకూ ఏఐసీపీఐ గణాంకాలు విడుదలయ్యాయి. వీటి ప్రకారం జూలైతో పోలిస్తే ఆగస్టులో ఏఐసీపీఐ సూచీలో 0.3 శాతం పెరుగదల నమోదైంది. జూన్ 2022తో పోలిస్తే జూలై నెలలో 0.7 శాతం పెరిగింది. అంటే జూన్ నుంచి ఆగస్టు వరకూ 1 శాతం పెరిగింది. జూన్‌లో ఏఐసీపీఐ 129.2 ఉండగా జూలై నెలలో 129.9కు చేరుకుంది. ఆటు ఆగస్టు నెలకు అది మరింత పెరిగి 130.2కు చేరుకుంది. రానున్న నెలల్లో ఈ సూచీ 1 శాతం పెరగవచ్చని అంచనా. ఫలితంగా డీఏ 3 శాతం పెరగవచ్చని అంచనా. 131.4  ఉంటే డీఏ 3 శాతం పెరుగుతుంది.


డీఏలో 3 శాతం పెరుగుదల నమోదైతే మొత్తం డీఏ 41 శాతానికి చేరుకుంటుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుకుంది. ఇప్పుడిక 41 శాతానికి చేరుకుంటే జీతం మరింత పెరగనుంది. 3 శాతం డీఏ పెరిగితే కనీస, గరిష్ట జీత భత్యాలు ఎలా ఉంటాయో చూద్దాం..


గరిష్ట జీతంపై అంచనా


సిబ్బంది కనీస వేతనం                                                          56,900 రూపాయలు
ప్రస్తుతం డీఏ 38 శాతం ప్రకారం                                            21,622 రూపాయలు
కొత్త డీఏ 41 శాతం ప్రకారం                                                    23,329 రూపాయలు
పెరగనున్న డీఏ                                                                       1797 రూపాయలు నెలకు
ఏడాదికి పెరగనున్న డీఏ                                                       20,484 రూపాయలు 


కనిష్ట కనీస వేతనంపై అంచనా


సిబ్బంది కనీస వేతనం                                                 18,000 రూపాయలు
ఇప్పుడున్న డీఏ 38 శాతం ప్రకారం                                6840 రూపాయలు
కొత్త డీఏ 41 శాతం ప్రకారం                                              7380 రూపాయలు
పెరిగిన డీఏ నెలకు                                                             540 రూపాయలు
పెరిగిన డీఏ ఏడాదికి                                                          6480 రూపాయలు


Also read: Flipkart Big Diwali Sale: అలాంటి ఆఫర్‌ మళ్లీమళ్లీ రాదు.. శామ్‌సంగ్ ఫ్లిప్, ఫోల్డ్ ధర ఎంతో తెలిస్తే షాకే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook