7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు మొన్న మార్చ్ నుంచి 4 శాతం డీఏ పెరగడంతో మొత్తం డీఏ 46 నుంచి 50 శాతానికి చేరుకుంది. అయితే డీఏ పెంపు వల్ల ఉద్యోగులకు ఇంకా ఇతరత్రా చాలా లాభాలు కలిగాయి. గ్రాట్యుటీ, హెచ్ఆర్ఏ ఇలా చాలా అంశాల్లో ఉద్యోగులకు లాభం కలగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగడంతో 46 శాతం నుంచి 50 శాతానికి డీఏ చేరుకుంది. డీఏ ఎప్పుడైతే 50 శాతం చేరుకుంటుందో నిబంధనల ప్రకారం మొత్తం డీఏను కనీస వేతనంలో కలిపి డీఏను తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు. అంటే ఉద్యోగి బేసిక్ శాలరీలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే కనీస వేతనం పెరిగిందో ఆటోమేటిక్‌గా హెచ్ఆర్ఏ వంటి ఇతర అంశాల్లో కూడా పెంపు కన్పిస్తుంది. నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ అనేది 33 ఏళ్లూ లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉంటే బేసిక్ శాలరీ, డీఏపై 16.5 రెట్లు చెల్లిస్తారు. ఇప్పుడు డీఏ 50 శాతం చేరుకోవడంతో గ్రాట్యుటీ  కూడా 25 శాతానికి చేరుకుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు గ్రాట్యుటీ రూపంలో  5 లక్షల కంటే ఎక్కువ చేతికి అందుతుంది. మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంటే గ్రాట్యుటీ 25 శాతానికి పెంచాలనేది నిబంధనలు చెబుతున్నాయి.


డీఏ పెరగడం వల్ల కలిగే మరో లాభం హెచ్ఆర్ఏ. ఎక్స్ , వై, జెడ్ కేటగరీ ప్రాంతాల్లో నివసించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. డీఏ 50 శాతం చేరుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే గ్రాట్యుటీపై ఇన్‌కంటాక్స్ ఉండదు. ఈ మినహాయింపు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాదు..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ట్యాక్స్ మినహాయింపు విషయంలో ప్రభుత్వం 2019లో ఆదేశాలు జారీ చేసింది.  20 లక్షల వరకూ గ్రాట్యుటీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 


Also: Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook