Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు చాలా సులవుగా లోన్స్ ఇస్తుంటాయి. పర్సనల్ లోన్, హోంలోన్, కార్ లోన్స్ ఇస్తుంటాయి. అంతేకాదు తక్కువ వడ్డీ రేటుకే ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపిస్తుంటాయి. మంచి క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్ధిక చరిత్రను, లోన్ తీర్చగలిగే సామర్థ్యాన్ని, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, బాధ్యతలను తెలియజేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు తాము ఇచ్చే లోన్స్ పై 20 బెసీస్ పాయింట్ నుంచి  -80 బెసీస్ పాయింట్స్ వరకు వడ్డీ తగ్గించే ఛాన్స్ ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రెడిట్ స్కోర్ 800కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు చాలా ఈజీగా కారు, బైక్, హోం ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంటాయి. అంతేకాదు వాటి ప్రీమియంలపై కూడా డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. ఆయా బ్యాంకులను బట్టి ఈ డిస్కౌంట్ 5శాతం నుంచి 15శాతం వరకు  ఉంటుంది. 


క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తుల రిస్క్ అసెస్మెంట్ ను తెలుసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బీమా సౌకర్యం కల్పించినా పెద్దగా ఎలాంటి రిస్క్ ఉండదని బ్యాంకులు భావిస్తుంటాయి. కాబట్టి బీమా ప్రీమియంలపై మంచి డిస్కౌంట్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. 


మీ క్రెడిట్ స్కోర్ 750 నుంచి 800 పాయింట్స్ మధ్య ఉంటే బ్యాంకులు మీకు కొత్త క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఇష్టపడతాయి. అంతేకాదు హయ్యర్ క్రెడిట్ లిమిట్ తో, తక్కువ వడ్డీతో మంచి రివార్డ్స్, ప్రయోజనాలతో ప్రీమియం క్రెడిట్ కార్డులు కూడా అందిస్తాయి. 


Also Read:Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?  


ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ , ఇన్సూరెన్స్ సెక్టార్లతో కొత్త ట్రెండ్ నడుస్తోంది. హైరింగ్ ప్రాసెస్ లో మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. అదేంటంటే సెక్టార్ కు చెందిన కంపెనీలు అభ్యర్థికి తెలియకుండానే వారి క్రెడిట్ స్కోర్ ను గానీ, క్రెడిట్ హిస్టరీని గానీ చెక్ చేయవు. అభ్యర్థుల పర్మిషన్ తో వారి క్రెడిట్ హిస్టరీని, స్కోర్ ను చూస్తుంటాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తే ఎలాంటి డిఫాల్టులులేకుంటే మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. 


Also Read: Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‎లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో  


ఈ ఆర్టికల్ లో చెప్పిన విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీరు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.