Electron Bot Malware: మీ సోషల్ మీడియా ఎక్కౌంట్లను నియంత్రించడమే కాకుండా ఓ ఆటాడించే కొత్త ప్రమాదకర మాల్వేర్ ఇది. దాదాపు 20 దేశాల్లో ఆందోళన కల్గిస్తోంది. మీ వరకూ చేరిందా..ఇక అంతే సంగతులు. ఆ వివరాలు చూసేద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్ని కొత్త మాల్వేర్ ఆందోళన కల్గిస్తోంది. ఇది మీ సోషల్ మీడియా ఎక్కౌంట్లను తన అదుపులో తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చెక్ పాయింట్ రీసెర్చ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్పిందాని ప్రకారం మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా డెస్క్‌టాప్‌లలోకి ఎలక్ట్రాన్ బాట్ విస్తరిస్తోంది. కొన్ని రకాల యాప్స్, గేమ్స్ ద్వారా ఈ ప్రమాదకరమైన మాల్వేర్‌ను వ్యాపింపజేస్తున్నాయని సీపీఆర్ నివేదిక చెబుతోంది. ముఖ్యంగా టెంపుల్ రన్, సబ్‌వే సర్ఫర్ వంటి గేమ్స్‌లో ఈ మాల్వేర్ ఉంటోందని ప్రత్యేకంగా పేర్కొంది.


ఎలక్ట్రాన్ బాట్ ఎలా పని చేస్తుంది


ఈ ఎలక్ట్రాన్ బాట్ మాల్వేర్ మీ పీసీలో చొచ్చుకుపోతుంది. యూజర్ గేమ్ లేదా యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడు అందులో ఆ మాల్వేర్ చొరబడుతుంది. పూర్తిగా డౌన్‌లోడ్ అయ్యాక.. మాల్వేర్ ప్రేరేపిత స్క్రిప్ట్‌ను ఆ గేమ్ లేదా యాప్ అమలు చేస్తుంది. ఈ మాల్వేర్‌ను గుర్తించలేకుండా చేసేందుకే గేమ్‌తో పాటు ఈ మాల్వేర్‌ను చొప్పిస్తున్నారని తెలుస్తోంది. ఒకసారి మీ పీసీలో మాల్వేర్ ప్రవేశించిన తరువాత సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్‌ను విషపూరితం చేస్తుంది. ఎస్ఈవో పాయిజనింగ్ అంటే సైబర్ క్రిమినల్స్ ఉపయోగించే ఓ రకమైన దాడి విధానం. మాలిషియస్ వెబ్‌సైట్స్‌ను బూస్ట్ చేసేందుకు ఈ విధనం ఉపయోగపడుతుంది. ఈ మాల్వేర్ మీ సోషల్ మీడియా ఎక్కౌంట్లను సీజ్ చేస్తుంది కూడా.


సీపీఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం..ఈ మాల్వేర్ పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్‌లో బల్గేరియాలోని మీడియా ఫైర్.కామ్ ద్వారా అప్‌లోడ్ చేశారు. అంతేకాదు..ఈ మాల్వేర్ క్యాంపెయిన్ బల్గేరియాకు చెందిన రెజ్లర్, ఫుట్‌బాల్ ప్లేయర్‌కు చెందిందిగా తేలింది. ఇతరుల యూట్యూబ్, సౌండ్ క్లౌడ్ ఎక్కౌంట్లను ప్రమోట్ చేసేందుకు మాల్వేర్ ఉపయోగించుకుంటుంది. 


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 5 వేలకంటే ఎక్కువమంది బాధితులు ఈ ఎలక్ట్రానిక్ బాట్ మాల్వేర్ బారిన పడ్టట్టు తెలుస్తోంది. కంప్యూటర్ రిసోర్సెస్, జీపీయూ కంప్యూటింగ్‌కు సంబంధించిన అన్నింటికి ఈ ఎలక్ట్రాన్ బాట్ మాల్వేర్ యాక్సెస్ అందిస్తుంది.  ప్రతి రన్ టైమ్‌లో సమర్ధవంతంగా లోడ్ అయినందున..హ్యాకర్లు కోడ్‌ను సులభంగా మోడిఫై చేయగలరు. బాట్స్ వైఖరిని మార్చగలరు కూడా. ఉదాహరణకు హ్యాకింగ్‌కు గురైన బాధితుడికి ఏ మాత్రం తెలియకుండానే..సెకండ్ స్టేజ్ హ్యాకింగ్‌కు తీసుకెళ్లి..మరో కొత్త మాల్వేర్ ర్యాన్‌సమ్‌వేర్ లేదా ర్యాట్‌ను చొప్పించగలరు. అంతటి ప్రమాదకరమైన మాల్వేర్ ఇది. తస్మాత్ జాగ్రత్త.


Also read: Samsung Galaxy A03: శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధరల వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook