Samsung Galaxy A03: శాంసంగ్ గెలాక్సీ ఏ03 వచ్చేసింది. శాంసంగ్ తన తొలి ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ 03 ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.
2022లో గెలాక్సీ ఏ సిరీస్ తొలి స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 6.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం కలిగుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వస్తుందని కంపెనీ చెబుతోంది.
ధర, లభ్యత
శాంసంగ్ గెలాక్సీ ఏ 03 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్-32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్‌లలో లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్ మోడల్ 10 వేల 499 రూపాయలు కాగా, 4 జీబీ ర్యామ్ 11 వేల 999 రూపాయలకు లభ్యం కానుంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. బ్లాక్, రెడ్, బ్లూ రంగులో దొరుకుతుంది. ఆన్‌లైన్‌తో పాటు రిటైల్‌లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో అయితే టెక్నా స్పార్క్ 8 ప్రో ఫోన్‌తో పోటీ పడనుంది. ఈ ఫోన్ 10 వేల 599 రూపాయలకు లభ్యం కానుంది. ఇది కూడా ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి..5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో ఉంది. 6 జీబీ ర్యామ్ సామర్ధ్యంతో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమేరా కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ప్రత్యేకతలు
శాంసంగ్ గెలాక్సీ ఏ03 3 జీబీ, 4 జీబీ ర్యామ్‌లలో లభ్యమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ సామర్ధ్యముంది. 1 టీబీ వరకూ పెంచుకునే అవకాశముంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 03 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ అవకాశముంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. ఇందులో డ్యూయల్ కెమేరా ఉంది. మెయిన్ కెమేరా 48 మెగాపిక్సెల్, f/1.8 ఎపెర్చర్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు f/2.4 ఎపెర్చర్ కలిగి ఉంది. ఇక సెల్పీ కెమేరా 5 మెగాపిక్సెల్ ఉండి f/2.2 ఎపెర్చర్ ప్రత్యేకతతో ఉంది. శాంసగ్ గెలాక్సీ ఏ 03లో డాల్బీ ఎట్మాస్ సపోర్ట్ ఉంది. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
Also read: Realme Narzo 50: రియల్‌మి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ధర కూడా చాలా తక్కువే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook