Aadhaar Card Updates: ఆధార్ ఇకపై పుట్టిన తేదీ ప్రూఫ్‌గా పనిచేయదు, డీవోబీ ప్రూఫ్ కోసం ఇవి కావల్సిందే
Aadhaar Card Updates: ఈపీఎఫ్ఓ నుంచి కీలకమైన అప్‌డేట్ జారీ అయింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ ముఖ్యమైన సూచన జారీ చేసింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన అప్‌డేట్ ఏంటో తెలుసుకుందాం..
Aadhaar Card Updates: ఆధార్ కార్డు ఇప్పటి వరకూ అడ్రస్ ప్రూఫ్, డేటాఫ్ బర్త్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగపడుతూ వచ్చింది. కానీ ఇకపై ఆధార్ కార్డును డేటాఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణించేందుకు వీల్లేదు. యూఐడీఏఐ చేసిన సూచనల మేరకు ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ప్రత్యేక అప్‌డేట్ జారీ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం తరపున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ఆధార్ కార్డును దేశంలో ఎక్కడైనా సరే అడ్రస్, ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు. కానీ పుట్టిన తేదీ ప్రూఫ్‌గా ఉపయోగపడదు. పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ జారీ చేసే బర్త్ సర్టిఫికేట్ కీలకం. ఏదైనా స్కూల్ బోర్డు జారీ చేసే మార్క్‌లిస్ట్ లేదా టీసీ కూడా పుట్టిన తేదీ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసు సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జత చేయవచ్చు.
ప్రభుత్వం జారీ చేసిన అడ్రస్ ప్రూఫ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ఫోటోతో కూడిన పుట్టిన తేదీ పత్రాలు ఉపయోగపడతాయి. ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్‌లో పుట్టినతేదీ మార్పులు చేర్పులు ఇతరత్రా వాటికి ఈ డాక్యుమెంట్స్‌లో ఏదో ఒకటి ఉపయోగించవచ్చు.
Also read: SSY Key Features: మీ పెట్టుబడికి మూడింతలు లాభం, మెచ్యూరిటీతో 70 లక్షలు పొందే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook