Accenture Fired Employees: ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. లే ఆఫల్ ప్రకటనలతో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా దిగ్గజ ఐటీ సంస్థ యాక్సెంచర్​ కూడా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. క్షీణిస్తున్న  గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్ దృష్ట్యా 19 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా వార్షిక ఆదాయం, లాభాల అంచనాలను తగ్గిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాక్సెంచర్ ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2.5 శాతం ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందులో సగానికి పైగా ఉద్యోగుల తొలగింపులు నాన్ బిల్లెబుల్ కార్పొరేట్ ఫంక్షన్లలో జరుగుతాయని కంపెనీ తెలిపింది. అంటే క్లైంట్స్‌కు బిల్ వేయలేని కార్యకాలపాలను పర్యవేక్షించే ఉద్యోగులపై ఎక్కువ శాతం వేటు పడనుంది. 


ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో యాక్సెంచర్ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి.. బిల్ చేయని కార్పొరేట్ విధులను మార్చడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి కార్యాలయ స్థలాన్ని ఏకీకృతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభావితమైన కంపెనీల సాంకేతిక బడ్జెట్‌లను తగ్గించే అవకాశం ఉన్నందున కంపెనీ ఇటీవల తన వార్షిక ఆదాయం, లాభాల అంచనాలను తగ్గించింది. కంపెనీ వార్షిక రాబడి వృద్ధి 8 నుంచి 10 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది. ఇది అంతకుముందు 8 నుంచి 11 శాతంగా ఉంది.


ఈ వారంలోనే అమెజాన్ కంపెనీ కూడా 9 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అమెజాన్ వెబ్ సర్వీస్, హెచ్ఆర్, అడ్వర్టైజింగ్, లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ విభాగాలలో తొలగిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన మెమోలో ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి విషయాలను అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ వెల్లడివంచారు. లాంగ్ రన్‌లో కంపెనీ విజయానికి ఇది చాలా కీలకమని అన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు వరుసగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ వర్క్‌ ఫోర్స్‌ తగ్గింపులో భాగంగా భారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఫేస్‌బుక్ మాతృసంస్థ  మెటా ఇప్పటివరకు దాదాపు 21 వేల మందిని తొలగించింది. గత వారమే 10 వేల మంది ఉద్యోగుల తొలగించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల తొలగింపు ప్రాసెస్ మరికొన్నేళ్లు ఉంటుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తదితర కంపెనీలు కూడా భారీగా ఉద్యోగాలను తొలగించాయి.


Also Read: Minister KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు


Also Read: Ind Vs Aus: నీ యవ్వ తగ్గేదేలే.. డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్‌లో సంబురాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి