Adani Group Shares: పుంజుకుంటున్న అదానీ గ్రూప్ షేర్లు, 15 శాతం వృద్ధి నమోదు చేసిన 8 కంపెనీలు
Adani Group Shares: షేర్ మార్కెట్ ఓపెన్ అవుతూనే..ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 15 శాతం వేగంతో పెరిగింది. షేర్ మార్కెట్లో అదానీ గ్రూప్‌కు చెందిన 8 కంపెనీలు గ్రీన్ కలర్‌తో ట్రేడ్ అవుతున్నాయి. అటు రెండు కంపెనీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి.
అదానీ గ్రూప్‌పై ముసురుకున్న కష్టాలు తొలగేట్టు కన్పిస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన కొన్ని కంపెనీల షేర్లు నిన్న అంటే సోమవారం నాడు ఒక్కసారిగా పెరగడమే ఇందుకు కారణం. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పుంజుకోవడం ఇదే. పూర్తి వివరాలు ఇలా..
అదానీ గ్రూప్ కంపెనీలకు ఈ వారం మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. నిన్న సోమవారం అంటే జనవరి 6వ తేదీన మార్కెట్ తెర్చుకోగానే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ విల్మర్, అదానీ పోర్ట్ వంటి 8 కంపెనీలు వేగంగా పుంజుకున్నాయి. ఆదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ మార్కెట్ ఓపెన్ అవగానే..15 శాతం వేగంతో అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. అదానీ గ్రూప్‌కు చెందిన 8 కంపెనీల షేర్లు గ్రీన్ కలర్‌లో అవగా..రెండు కంపెనీలు మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి.
బీఎస్ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 15 శాతం పుంజుకుని అప్పర్ సర్క్యూట్ 1808.25 రూపాయలకు చేరుకుంది. దాంతోపాటు అదానీ ఎంటర్‌ప్రైజస్ మార్కెట్ క్యాప్ 2.06 లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 8.96 శాతం పెరిగి 595 రూపాయలకు చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ 1.28 లక్షల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా అదానీ విల్మర్ 5 శాతం పెరిగి 399.40 రూపాయలు, అదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం వృద్ధితో 1324.45 రూపాయలకు చేరుకుంది.
ఉదయం జరిగిన ట్రేడింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ 2.10 శాతం లాభంతో 906.15 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నం మాత్రం తిరిగి 3 శాతం క్షీణత నమోదైంది. అదానీ టోటల్ గ్యాస్ షేర్ 5 శాతం పడిపోయి..లోయర్ సర్క్యూట్ అంటే 1467.50 రూపాయలకు చేరుకుంది. అదానీ పవర్ 4.99 శాతం నష్టాల్లో ఉంది. ఈ కంపెనీ షేర్ 173.35 రూపాయలుగా ఉంది. ఆ తరువాత మద్యాహ్నం జరిగిన ట్రేడింగ్ లో ఏసీసీ, అంబూజా సిమెంట్ రెండింటి షేర్ పెరిగింది. ఎన్డీటీవీ షేర్ మద్యాహ్నం 8 శాతం పెరిగింది. ఈ కంపెనీ షేర్ 223.85 రూపాయలకు ట్రేడ్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook