Nissan 7 Seater: మారుతి ఎర్టిగా కంటే తక్కువ ధరకే నిస్సాన్ 7 సీటర్ కారు, త్వరలో లాంచ్ చేయనున్న నిస్సాన్

Nissan 7 Seater: మారుతి ఎర్టిగాకు దీటుగా..అంతకంటే తక్కువకు నిసాన్ 7 సీటర్ ఎంపీవీ లాంచ్ కానుంది. ఈ కారు ఎలా ఉంటుంది, ధర ఎంత, ఫీచర్లు ఏంటనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 9, 2023, 06:51 PM IST
Nissan 7 Seater: మారుతి ఎర్టిగా కంటే తక్కువ ధరకే నిస్సాన్ 7 సీటర్ కారు, త్వరలో లాంచ్ చేయనున్న నిస్సాన్

నిసాన్ ఇండియా త్వరలోనే యూవీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. జపాన్ కంపెనీ ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ప్రాధమిక వివరాలు అందించింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న నిసాన్ ఎక్స్ ట్రేల్ 2023 నుంచి విక్రయాలు ప్రారంభించవచ్చు. టొయోటా ఫార్చ్యూనర్‌కు దీటుగా నిస్సాన్ ఎక్స్ ట్రేల్ లాంచ్ చేస్తోంది. అదే సమయంలో రీనాల్ట్ ట్రైబర్‌తో కలిసి నిస్సాన్ కంపెనీ కొత్తగా 7 సీటర్ లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. 

కొత్త నిసాన్ 7 సీటర్ ఎంపీవీ గురించి పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేవు. అయితే రీనాల్ట్ ట్రైబర్ కంపెనీతో కలిసి పవర్ ట్రేన్, ఫీచర్లను అందిపుచ్చుకోనుందని సమాచారం. ఇందులో 1.0 లీటర్ 3 సిలెండర్, నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది 71 బీహేచ్‌పి పవర్, 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. కొత్త ఎంపీవీ 7 సీటర్ కారును టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టవచ్చు. రెండింట్లో మ్యాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆఫర్ ఉన్నాయి. నిస్సార్ 7 సీటర్ ఎంపీవీ ధర మారుతి ఎర్టిగో కంటే తక్కువ ఉండవచ్చని తెలుస్తోంది. 

డిజైన్ విషయంలో కొత్త నిసాన్ 7 సీటర్ ఎంపీవీ రేనో ట్రైబర్ కంటే భిన్నంగా కన్పిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని డిజైన్ ఎలిమెంట్లు నిసాన్ మైగ్రైట్‌ను పోలి ఉంటాయి. అయితే డైమెన్షన్ ప్రకారం ట్రైబర్‌లానే ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటు 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, రిమూవెబుల్ ధర్డ్ రో, పుష్ బటన్ స్టార్ట్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, సెకెండ్ రో రిక్లైన్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also read: Income Tax: 30 ఏళ్ల క్రితం ఎంత ఆదాయంపై ఎంత ట్యాక్స్ ఉండేదో తెలుసా, వైరల్ అవుతున్న ఫోటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News