Adani Group new business: అప్రతిహత ప్రస్తానంతో భారత పారిశ్రామిక రంగంలో తనదైన ముద్రవేసిన రిలయన్స్ ను సంపదలో ఏనాడో దాటిపోయిన గౌతమ్ అదానీ ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తర్వాత వెనక్కితిరిగి చూసుకోని ఆయన....  ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను కూడా సంపదలో  దాటేసినట్లు ఫోర్బ్స్ డేటా ప్రకటించింది.  ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి ఎగబాకిన అదానీ.... కేవలం 59సంవత్సరాల వయస్సులోనే  ఏకంగా 123.7 బిలియన్ డాలర్ల సంపదను పోగేశారు. అనతి కాలంలోనే అంచలంచెలుగా ఎదిగిన అదానీ ఇప్పుడు భారత పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎనలేని సంపదనను పోగు చేసుకున్న ఆయన ఇప్పుడు అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌లో హోల్‌సిం కంట్రోలింగ్ వాటా కొనుగోలు కోసం సిద్ధం అవుతున్నారు. ఈ రెండు సంస్థల మధ్య ఈపాటికే చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. కొనుగోలు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని త్వరలోనే  ఒప్పందం పత్రాలపై ఇరు పక్షాలు సంతాలు చేయనున్నాయని సమాచారం.  జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్‌తోపాటు ఇత‌ర బిడ్డ‌ర్లు కూడా హోల్‌సిం కొనుగోలు కోసం ఆస‌క్తి ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే అదానీ ఆఫర్ చేస్తున్నంత మొత్తాన్ని వాళ్లు ఇచ్చేందుకు శక్తిచాలకపోవడంతో అంబుజా అదానీకే దక్కుతుందని సమాచారం. 


అయితే హోల్‌సిం, జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్ ప్ర‌తినిధులు అదానీ ఆఫర్ పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మార్కెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై అటు అదానీ గ్రూప్‌ ప్రతినిధులు కాని ఇటు అంబుజా గ్రూప్ ప్ర‌తినిధులు కాని  స్పందించడం లేదు. అయితే గత కొంత కాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల హోల్‌సిం ఇటీవ‌లి తన వ్యాపారాలను తగ్గించుకుంటోంది. ఇటీవలే బ్రెజిల్‌లోని త‌న యూనిట్‌ను 100 కోట్ల డాల‌ర్ల‌కు అమ్మేసింది. జింబాబ్వేలో త‌న బిజినెస్‌ను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తోందని. ఈ క్రమంలోనే అంబుజా సిమెంట్‌ను మంచి ఫ్రావిట్ కు అమ్మేయాలని చూస్తోంది. 


సిమెంట్ రంగంలో తన ప్రస్థానాన్ని1983లో ప్రారంభించిన అంబుజా సిమెంట్ ... ఇప్పుడు ఏటా 31 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యానికి చేరుకుంది.  దేశంలోనే ఎనిమిదవ అతి పెద్ద గ్రిల్లింగ్ యూనిట్ల‌తో దూసుకుపోతోంది. అయితే ఈ రంగంలో అదానీ గ్రూప్ అనుబంధ అయినా అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ సంస్థ‌కు కేవలం రెండు గ్రిల్లింగ్ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగతా యూనిట్లను కొనుగోలు చేస్తే కాని మార్కెట్ లో అగ్రగామిగా ఎదగలేమని గ్రహించిన అదానీ... అంబుజా గ్రూప్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ పై సంతృప్తి చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌ తన యూనిట్ల అమ్మకానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు సమాచారం. 


also read


Flipkart Month End Mobile Fest: 5 వేల బడ్జెట్‌లో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే


SBI Phishing Scam: మీరు ఎస్‌బీఐ కస్టమర్లా.. అయితే ఈ అలర్ట్ మీకోసమే... ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తే అంతే సంగతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.