Adani in Media: ప్రముఖ జాతీయ టీవీ ఛానెల్ యాజమాన్యం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. అదానీ గ్రూప్ సదరు టీవీ ఛానెల్‌ను కొనుగోలు చేస్తోందంటూ గత కొద్దికాలంగా విన్పిస్తున్న వార్తలకు తెరపడింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదానీ గ్రూప్(Adani Group). పోర్టుల వ్యాపారంలో దూసుకుపోతోంది. కొత్తగా గ్రీన్‌ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. గ్రీన్‌ఎనర్జీ రంగంలో భారీగా లక్ష్యాల్ని ప్రకటించిన కొద్దిరోజులకే అదానీ గ్రూపు నుంచి గ్రీన్‌ఎనర్జీ(Green Energy)ప్రకటన వెలువడటం గమనార్హం. మరోవైపు అదానీ గ్రూప్ మీడియా రంగంలో అడుగు పెడుతుందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బిజినెస్, రాజకీయ రంగాల్లో ఈ వార్త ఎక్కువగా వైరల్ అవుతోంది. అదే సమయంలో పలు మీడియా సంస్థల్లో ఉన్నత హోదాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు సంజయ్ పుగాలియా ఇటీవల అదానీ గ్రూపులో చేరడం వాదనలకు మరింత బలం చేకూర్చింది. కొత్తగా మీడియా సంస్థను నెలకొల్పకుండా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీని కొనుగోలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఫలితంగా ఎన్డీటీవీ షేర్లు పదిశాతం పెరిగాయి కూడా. ఫలితంగా ఇప్పుడు ఎన్డీటీవీ యాజమాన్యమే స్పందించాల్సి వచ్చింది. యాజమాన్య మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఎన్డీటీవీ ప్రకటించింది. ఎన్డీటీవీ అమ్మకానికి సంబంధించి ఇప్పుడు గానీ, గతంలో గానీ ఎవరితోనూ చర్చలే జరగలేదని ఎన్డీటీవీ(NDTV) ఫౌండర్లు ప్రణయ్ రాయ్, రాధికలు ప్రకటించారు. 


తమ టీవీ ఛానల్‌ యాజమాన్య మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిరాధరామైనవని ఎన్డీటీవీ ప్రకటించింది. ఎన్డీటీవీ అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం కానీ, గతంలో కానీ ఎవరితో చర్చలు జరగలేదని ఆ టీవీ ఛానల్‌ ఫౌండర్లు, మేజర్‌ షేర్‌ హోల్డర్లయిన ప్రణయ్‌రాయ్‌, రాధికలు ప్రకటించారు.


Also read: Amazon Legal Issues: ఇండియాలో అమెజాన్ వివాదాలు, లీగల్ ఫీజులు ఫీజులు కోట్లలో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook