Adani Energy: కొత్త ఏడాదిలో అదానీ కంపెనీ మరో టేకోవర్, ఎనర్జీ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు
Adani Energy: అదానీ గ్రూప్ కొత్త ఏడాదిలో మరో కంపెనీని టేకోవర్ చేస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ ఏడాది ఎనర్జీ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.
అదానీ గ్రూప్ కొత్త ఏడాదిలో మరో కంపెనీని కొనుగోలు చేయనుంది. ఓ ఎనర్జీని 50 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఈ డీల్ విలువ 15 కోట్ల రూపాయలు. ఎస్సెల్ సౌర్య ఊర్జా కంపెనీతో ఈ డీల్ జరుగుతోందని అదానీ గ్రూప్ వెల్లడించింది.
అదానీ గ్రూప్ ఎనర్జీ
అదానీ గ్రూప్ ఇప్పుడు రాజస్థాన్‌లోని ఎస్సెల్ సౌర్య ఊర్జా కంపెనీలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అదానీ రెన్యూయెబుల్ ఎనర్జీ హోల్డింగ్స్ లిమిటెడ్ అదానీ గ్రీన్ ఎనర్జీకు చెందిన అనుబంధ సంస్థ.
రాజస్థాన్ ప్రభుత్వం చేతిలో 50 శాతం వాటా
అదానీ గ్రీన్ ఎనర్జీ తన అనుబంధ సంస్థ జనవరి 17వ తేదీన 2023న ఎస్సెల్ ఇన్‌ఫ్రా ప్రోజెక్ట్స్ లిమిటెడ్‌తో ఓ ఒప్పందం చేసుకుందని షేర్ మార్కెట్‌కు వెల్లడించింది. మిగిలిన 50 శాతం ఈక్విటీ షేర్ రాజస్థాన్ ప్రభుత్వం వద్దే ఉంటుంది. అదానీ రెన్యుయెబుల్ ఎనర్డీ హోల్డింగ్ లిమిటెడ్ వద్ద రాజస్థాన్‌లో 750 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర పార్క్ ఉంది. 2021-22లో ఈ సంస్థ వ్యాపారం 9.87 కోట్ల రూపాయలు.
షేర్లలో పురోగతి
అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ల గురించి పరిశీలిస్తే..కంపెనీ స్టాక్ గత 5 పనివేళల్లో 10.52 శాతం పెరిగింది. ఈ సమయంలో స్టాక్ వ్యాల్యూ 198.50 రూపాయలు పెరిగి..2,085.50 రూపాయలకు చేరుకుంది. ఈ షేర్ 52 వారాల రికార్డు స్థాయి 3,050 రూపాయలకు చేరుకోగా, 52 వారాల కనిష్ఠం 1, 650.20 రూపాయలకు చేరుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook