Adani-Hindenburg Row: అదానీ దిద్దుబాటు చర్యలు, స్వచ్ఛంధ ఆడిట్ కోసం జీటీ కంపెనీ నియామకం
Adani-Hindenburg Row: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపధ్యంలో దారుణంగా పతనమైన అదానీ గ్రూప్ నష్టాల్నించి కోలుకునేందుకు చర్యలు చేపట్టింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సమాధానమిచ్చేందుకు జనరల్ ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌ను ఎంతగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ కుబేరుల జాబితాలో 3 వస్థానలో ఉన్న గౌతమ్ అదానీ..22వ స్థానానికి పడిపోయారు. మరోవైపు కంపెనీ షేర్లు పడిపోతుండటంతో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది.
అదానీ గ్రూప్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో పతనమౌతున్న షేర్ల ధరల్ని కాపాడుకునేందుకు, నష్టాల్ని ఎదుర్కొనేందుకు స్వచ్ఛంధంగా ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రపంచ ప్రసిద్ధ ఆడిట్ కంపెనీ గ్రాంట్ థార్న్‌టన్ స్థూలంగా జీటీ కంపెనీను ఎంచుకుంది.
మరోవైపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్‌పై సంధించిన ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణల నేపధ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు, స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ మెకానిజంను పటిష్టం చేసేందుకు సుప్రీంకోర్టు సూచనల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. మరోవైపు అదానీ గ్రూప్ షేర్ ధరలో భారీగా క్షీణత నమోదైంందని సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అటు సెన్సెక్స్‌లో దీని ప్రభావం ఏం లేదని..నిఫ్టీలో 1 శాతం కంటే తక్కువే ఉందని సెబీ వెల్లడించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం నేపధ్యంలో రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ సమీక్షించేందుకు మార్కెట్‌పై ఏ విదమైన ప్రభావం కన్పించలేదని సెబీ తెలిపింది. అంటే హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ వ్యవహారం మార్కెట్‌పై పెద్దగా లేదని..కానీ అదానీ గ్రూప్ షేర్లు మాత్రం పడిపోతున్నాయని సెబీ తెలిపింది.
Also read: Maruti Swift: కేవలం లక్ష రూపాయలు చెల్లించి మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్ ఇంటికి తీసుకెళ్లండి ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook