Airtel Big Offer: మీకు తెలుసా.. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర చాలా వరకు తగ్గించబడింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ సర్వీసులతో పాటుగా వివిధ రకాల OTT ప్లాట్‌ఫారమ్‌లను సబ్‌స్క్రిప్షన్‌లతో ఎయిర్‌టెల్ యొక్క DTH సెట్-టాప్ బాక్స్ సేవలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు  ఈ సెట్-టాప్ బాక్స్‌ను కొనటం వలన మీరు ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లలో సభ్యత్వాన్ని పొందుతారో మరియు వాటి వాటి ధరలు ఎంత తగ్గించబడిందో ఇపుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Airtel Xstream బాక్స్ పై తగ్గింపు
ఇంతకు ముందు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ ధర రూ. 2,499గా ఉంది. ఇప్పుడు మీరు ఈ DTH సేవను రూ. 500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లో తెలిపిన దాని వివరాల ప్రకారం, ఇపుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర రూ. 2,499 నుండి రూ. 2,000కి తగ్గించబడింది. అంటే ఇప్పుడు DTH సేవతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు Sony-LIV వంటి అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లను రూ. 2,000కి పొందొచ్చు. 


Airtel Xstream బాక్స్ తో OTT సబ్‌స్క్రిప్షన్‌లు
Airtel Xstream Box ని కొంటే కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచితంగా సభ్యత్వం కల్పిస్తుంది. ఈ DTH ఆఫర్ ద్వారా, మీరు Amazon Prime వీడియో, Disney+Hotstar, SonyLIV, Eros Now మరియు Hungamaతో సహా మరిన్ని యాప్‌లకు ఉచిత ప్రాప్యతను పొందుతారు. వీటికి మీరు ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.


Airtel Xstream బాక్స్ వివరాలు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్ మరియు ఆండ్రాయిడ్ టీవీ OS లలో పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ముందుగానే Google Play లోడ్ చేయబడి ఉంటుంది. Google Play సహాయంతో, మీరు 5 వేల కంటే ఎక్కువ యాప్‌లు మరియు గేమ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా,  ఇందులో ప్రత్యేక Chromecast మద్దతు కూడా అందించబడుతుంది, తద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్ నుండి టీవీలో ఏదైనా ప్లే చేసే అవకాశం కూడా ఉంటుంది.  


ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క DTH సేవలు మరియు OTT సబ్‌స్క్రిప్షన్‌ల ప్రయోజనాన్ని పొందాలంటే.. మీ ఎయిర్‌టెల్ DTH ఖాతాలో కనీసం రూ. 153 నెలవారీ బ్యాలెన్స్ కలిగి ఉండాలన్న సంగతి మర్చిపోకండి. 


Also Read: MS Dhoni: ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు! కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు!!


Also Read: RRR rajamouli remuneration: ఆర్​ఆర్​ఆర్​ కోసం రాజమౌళి ఎంత తీసుకున్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook