MS Dhoni: ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు! కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు!!

IPL 2022: MS Dhoni hands over the captaincy of CSK to Ravindra Jadeja. ఎంఎస్ ధోనీ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 05:47 PM IST
  • ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం
  • కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
  • కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు
MS Dhoni: ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు! కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు!!

MS Dhoni started his captaincy stint with a trophy and ended it the same way: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆరంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోనీ తప్పుకున్నాడు. ఈ నిర్ణయంతో అతడి అభిమానులు మరోసారి షాక్ అయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భారత జట్టు కెప్టెన్సీ నుంచి కూడా మహీ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ధోనీ కెప్టెన్సీ శకం ముగిసింది. ఇక ఎంఎస్ ధోనీ వారసుడిగా టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు.  ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ సోషల్​ మీడియాలో పేర్కొంది.

ఎంఎస్ ధోనీ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మహికి ఇదే చివరి ఐపీఎల్‌ అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి.. తలా కెప్టెన్‌గానే మెగా లీగ్‌ల్‌ను ముగిస్తే బాగుండేదని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు', 'ధోనీ కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు', 'టాస్ సమయంలో మహీని మిస్ అవుతాం', 'గొప్ప ప్లేయర్స్ చాలా అరుదు' అంటూ ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. 

ఆరంభం నుంచి సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌ చరిత్రలోనే అ‍త్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. నాలుగుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఒక జట్టును ఎక్కువసార్లు ఫైనల్స్‌, ప్లే ఆఫ్‌ వరకు తీసుకెళ్లిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో మహీ సారధ్యంలో సీఎస్‌కే టైటిల్‌ గెలిచింది. ధోనీ ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 121 మ్యాచ్‌లు గెలిచాడు. ఇక 82 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 

ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు ధోనీతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గక్వాడ్, మొయిన్ అలీలను సీఎస్‌కే రిటైన్‌ చేసుకుంది. అయితే మహీ తన కంటే జడేజాకు ఎక్కువ ప్రైజ్‌ ఇవ్వడం శ్రేయస్కరమని ప్రాంచైజీ యజమానులకు స్వయంగా తెలిపాడట. దీంతో జడేజాకు రూ. 16 కోట్లు పెట్టిన చెన్నై.. ధోనీకి రూ.12 కోట్లు పెట్టి అట్టిపెట్టుకుంది. దీనిబట్టి చుస్తే.. మహీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని స్పష్టంగా తెలుస్తోంది.  

Also Read: RRR Movie Tickets: టిక్కెట్స్ బ్లాక్ చేసి.. మూడు వేలకి ఒక్కో టికెట్ అమ్ముతున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు!!

Also Read: IPL 2022: 14 టోర్నీల్లో 20 హ్యాట్రిక్‌లు.. భారత్ నుంచి 11 మంది! అత్యధిక 'హ్యాట్రిక్' హీరో మనోడే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News