Airtel Lowest Recharge: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ 2022 ఏడాదిలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.99 లకే దాదాపుగా నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ప్రకటించింది. గతంలో రూ.79గా ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్.. ఇటీవలే జరిగిన ప్రీపెయిడ్ టాప్ అప్ ల పెంపుల కారణంగా రూ.99లకు చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్లాన్ లో 200 MB డేటాతో పాటు రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. సెకనుకు పైసా టారిఫ్ తో రీఛార్జ్ ఆఫర్ ను పొందుతారు. ఒక్క SMSకు రూ.2.. అదే విధంగా STD మెసేజ్ కోసం రూ. 1.5 వసూలు చేయనుంది భారతీ ఎయిర్ టెల్. ఈ ఆఫర్ 28 రోజుల వ్యాలిడిటీతో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. 


రూ.50లతో రీఛార్జ్ చేయవచ్చా?


లేదు. మీరు రూ.50 రీఛార్జ్ చేయలేరు. కానీ, రూ.100 కంటే తక్కువ ధరతో ఉన్న డేటా వోచర్లను పొందవచ్చు. అయితే అందుకు మీ మొబైల్ నంబరుపై బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్ లో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే ఈ డేటా వోచర్లు పనిచేస్తాయి. ఎయిర్ టెల్ లో డేటా వోచర్లు రూ. 58 నుంచి ప్రారంభమవుతాయి. 


ఈ ప్లాన్ తో 3 GB డేటా వస్తుంది. అదే విధంగా రూ.98 డేటా వోచర్ పై 5 GB డేటాతో పాటు Wynk Music Premium ప్రయోజనం పొందవచ్చు. ఈ రెండు ప్లాన్ ల వ్యాలిడిటీ.. బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ముగుస్తుంది. 


రూ.49 ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ తొలగించారా?


అవును.. గతేడాది నవంబరు వరకు అందుబాటులో ఉన్న కనీస రీఛార్జ్ రూ.49 ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెరుగుదల కారణంగా ఆ ప్లాన్ ఇప్పుడు రూ.79 లకు అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్స్ లో ఇప్పుడిదే అత్యల్ప రీఛార్జ్.  


ALso Read: Budget 2022 Impacts: బడ్జెట్ 2022 ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?


ALso Read: Union Budget 2022: బడ్జెట్​కు ముందు హల్వా వేడుకను రద్దు చేసిన మోదీ సర్కారు.. కారణమదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook