unlimited 5G plans: దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో  మెుబైల్ యూజర్లకు షాక్ ఇవ్వబోతున్నాయి. ఈ రెండు సంస్థలు  2024 ద్వితీయార్ధంలో తమ అపరిమిత 5జీ డేటా ప్లాన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక నుంచి  4 జి టారిఫ్ కంటే కనీసం 5-10% ఎక్కువగా 5 జీ టారిఫ్ ను వసూలు చేసే అవకాశం ఉందట. ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుడలా...
రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్ టెల్ (Bharti Airtel) 2022 అక్టోబర్లో దేశంలో 5జీ సేవలను ప్రారంభించాయి. అప్పటి నుండి ప్రస్తుత 4 జీ టారిఫ్లతో అపరిమిత 5 జి సేవలను అందిస్తున్నాయి. అయితే అపరిమిత 5జీ ఆఫర్ల యుగం త్వరలోనే ముగియనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, ఆదరణ పెరిగే కొద్దీ మానిటైజేషన్ పై మరింత దృష్టి సారించాలని ఆ రెండు సంస్థలు యోచిస్తున్నాయి. మన దేశంలో ఈ రెండు కంపెనీలు ప్లవంలో ముందంజలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలకు కలిపి  12.5 కోట్లకు పైగా 5 జీ యూజర్లు ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరి నాటికి  దేశంలో 5G వినియోగదారుల సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా.


ఇప్పుడిలా..
ఎయిర్ టెల్, జియో తమ 5జీ ప్లాన్లను 5-10% (ప్రస్తుత 4జీ ప్లాన్లతో పోలిస్తే) పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు 30-40% అదనపు డేటాను అందించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. RoCE (Return on capital employed) ను మెరుగుపరిచేందుకు 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో మొబైల్ టారిఫ్‌లు కనీసం 20% పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 


Also read: Best Cars Under 10 Lakhs: రూ.10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే.. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ..


భారీగా పెరగనున్న మొబైల్ రంగం ఆదాయం 
భారతదేశంలో టెలికాం సర్వీస్ టారిఫ్ ఇప్పటికీ సగటున నెలకు 2 డాలర్లుగా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ధరలను పెంచుకునే వీలుంది. జియో, వీఐ, ఎయిర్ టెల్ సంస్థలు తమ టారిఫ్ లు 19-25 శాతం పెంచి రెండేళ్లు దాటింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,46,800 కోట్లుగా ఉన్న మొబైల్ రంగం ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,77,300 కోట్లకు, 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,07,800 కోట్లకు పెరుగుతుందని అంచనా ఉంది.


Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook