January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!

Bank Holidays in January 2024: బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. రెండో శనివారం, ఆదివారానికి తోడు సంకాంత్రి, ఆయా రాష్ట్రాల్లో పండుగల కారణంగా ఐదు రోజులు బ్యాంకులకు హాలీ డేస్ ఉన్నాయి. ఏ రోజు ఎక్కడ సెలవు అంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 10:16 PM IST
January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!

Bank Holidays in January 2024: బ్యాంక్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి బ్యాంకులు వరుసగా ఐదు రోజులపాటు బంద్ కానున్నాయి. బ్యాంక్‌లో ముఖ్యమైన పని ఉంటే బ్రాంచ్‌కు వెళ్లకుండా ఆగిపోవడం మంచింది. మకర సంక్రాంతి, పొంగల్, లోహ్రీ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవులు ప్రకటించింది. జనవరి నెలలో మొత్తం 14 బ్యాంకులకు హాలీ డేస్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సేవలు 5 రోజులపాటు నిలిచిపోనున్నాయి. శనివారం నుంచి జనవరి 17వ తేదీ వరకు బ్యాంకులు క్లోజ్ అవుతాయి. అయితే బ్యాంక్‌లు బంద్ అయినా.. ఆన్‌లైన్ సేవలు యాథావిధిగా కొనసాగుతాయి. 

సెలవులు ఇలా..

==>> జనవరి 13- రెండో శనివారం
==>> జనవరి 14- ఆదివారం
==>> జనవరి 15- పొంగల్/తిరువళ్లువర్ రోజు/మకర సంక్రాంతి/మాగ్ బిహు కారణంగా బెంగళూరు, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు. 
==>> జనవరి 16- తిరువళ్లువర్ దినోత్సవం కారణంగా చెన్నైలోని బ్యాంకులకు సెలవు
==>> జనవరి 17- ఉజ్హవర్ తిరునాల్ కారణంగా చెన్నైలో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఈ నెలలో మిగిలిన సెలవులు ఇలా..

==>> జనవరి 21- ఆదివారం 
==>> జనవరి 23- ఇంఫాల్‌లో సెలవు
==>> జనవరి 25- థాయ్ పోషం/హజ్రత్ మొహమ్మద్ అలీ పుట్టినరోజు కారణంగా చెన్నై, కాన్పూర్, లక్నోలో బ్యాంకులు బంద్
==>> జనవరి 26- రిపబ్లిక్ డే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే 
==>> జనవరి 27- నాల్గో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.
==>> జనవరి 28- ఆదివారం 

బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ముందుగానే రిలీజ్ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో పండుగల ఆధారంగా సెలవులు ప్రకటిస్తుంది. మీరు ప్రతి నెలా బ్యాంక్ హాలీడేస్‌ను తెలుసుకోవాలంటే.. అధికారిక వైబ్‌సైట్‌ను https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx సందర్శించండి.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News