Airtel New Plan: స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగే కొద్దీ డేటా వినియోగం పెరిగిపోతోంది. మొబైల్ డేటా ప్రతి ఒక్కరికీ ఓ అవసరంగా మారిపోయింది. అందుకే టెలీకం కంపెనీలు కూడా డేటాను ప్రాధాన్యత ఇస్తూ ప్లాన్స్ విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన కొత్త డేటా ప్లాన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అతి తక్కువ ధరకే మొబైల్ డేటా లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ కొత్తగా లాంచ్ చేసిన ఈ ప్లాన్ కేవలం 9 రూపాయలకే లభిస్తుంది. ఇదొక అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ డేటా ప్లాన్. ఇదొక స్పెషల్ ప్యాక్. ఇందులో కేవలం అన్‌లిమిటెడ్ డేటా మాత్రమే లభిస్తుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా డేటా అత్యవసరం అయినప్పుుడు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌తో వాయిస్ కాలింగ్ ప్రయోజనం ఉండదు. కేవలం డేటా మాత్రమే ఉంటుంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు సులభంగా రీఛార్డ్ చేసుకోవచ్చు. కేవలం 9 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 


ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ 9 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. కానీ ప్యాక్ కేవలం ఓ గంటే పనిచేస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా 60 నిమిషాలు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే గంటే అయినా అన్‌లిమిటెడ్ స్పీడ్ డేటా ఉంటుంది. ఇందులో డేటా స్పీడ్ 10 జీబీ ఉంటుంది. గంట తరువాత వేగం తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా అత్యవసరమైంది డౌన్‌లోడ్ చేయాల్సి వచ్చినపప్పుడు, రోజువారీ డేటా పూర్తయినప్పుడు ఈ 9 రూపాయల డేటా ప్లాన్ ఉపయోగపడుతుంది. 10 జీబీ కంటే ఎక్కువ డేటా కావాలంటే 129 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. వాయిస్ ప్లాన్ ఉన్నంతవరకూ వర్తిస్తుంది. కానీ కొత్త ప్లాన్‌తో అదే 10 జీబీ డేటా 9 రూపాయలకే లభిస్తుంది.


ఎయిర్‌టెల్ ఇటీవల 395 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇంతకుముందు  ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుండేది. ఇప్పుడు 70 రోజులకు పెరిగింది. ఇందులో 6 జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్‌తో పోలిస్తే జియోలో మరో చౌకైనా ప్లాన్ ఉంది. ఇదే 395 రూపాయలకు జియో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. 


Also read: Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook