Airtel Prepaid Plans: దేశంలో గత కొద్దికాలంగా ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఓటీటీ ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వివిధ రకాల ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. యూజర్లను నిలబెట్టుకునేందుకు లేదా కొత్తవారిని ఆకట్టుకునేందుకు ఈ రెండు కంపెనీలు ఓటీటీలతో కొన్ని ప్లాన్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్‌తో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ 5జి డేటా ఆస్వాదించవచ్చు.


ఎయిర్‌టెల్ 699 ప్లాన్


699 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. వ్యాలిడిటీ 56 రోజులుంటుంది. ఈ ప్లాన్ తీసుకుంటే ఇదే కాల వ్యవధికి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా అందుతుంది. ఇక అన్‌లిమిటెడ్ 5జి డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే, అపోలో 24 గంటలు సేవలు, ఉచిత హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ మెంబర్‌షిప్ ఫీచర్లు లభిస్తాయి.


ఎయిర్‌టెల్ 999 రూపాయల ప్లాన్


999 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇదే కాల వ్యవధికి అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా లభిస్తుంది. ఇక అదనంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24 గంటల సేవలు, ఉచిత హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాప్ ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి.


ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ ప్లాన్లతో పాటు పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు సైతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సేవలు ఉచితంగా అందే ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో 499 రూపాయల్నించి 1199 రూపాయల వరకూ వివిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జీ డేటా, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చుు.


Also read: Hybrid Cars: మైలేజీలో దుమ్ములేపుతున్న కార్లు.. ఎగబడి కొంటున్న జనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook