Airtel 199 Plan: ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్
Airtel 199 Plan: ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ కస్టమర్లకు శుభవార్త. ఎయిర్‌టెల్ మరో అద్భుతమైన ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇతర కంపెనీలో పోలిస్తే ఇదే బెస్ట్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడి మరీ ఆఫర్లు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్ అందిస్తోంది. 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉన్న ఆఫర్ ఇది.
ప్రముఖ టెలీకం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఇది కచ్చితంగా గుడ్‌న్యూస్. ఎందుకంటే ఈ ఆఫర్‌లో కేవలం 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తోంది. ఎయిర్‌టెల్ ప్లాన్ 199 లో వ్యాలిడిటీ 28 రోజులు కాకుండా..30 రోజులుంటుంది. డేటా పెద్దగా అవసరం లేనివారికి ఇది బెస్ట్ ప్లాన్. ఇందులో నెలకు 3జీబీ డేటా లభిస్తుంది. ఏదైనా నెట్‌వర్క్‌కు ఆ 30 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌకర్యముంది.
ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా ఉండదు. నెలకు ఎప్పుడైనా వాడుకునేలా 3 జీబీ డేటా ఉంటుంది. వినియోగదారులకు 300 ఎస్ఎంస్ సౌకర్యముంటుంది. 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటు అదనంగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఉచితంగా హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ లాభాలుంటాయి. 3 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు పూర్తయ్యాక..ప్రతి ఎంబీకు 50 పైసలు, ప్రతి మెస్సేజ్‌కు 1 రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. డేటా ఎక్కువగా వినియోగించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానేకాదు.కేవలం కాల్స్ కోసమే అయితే మంచి ప్రత్యామ్నాయం.
ఇది కాకుండా డేటా కూడా కావాలనుకుంటే ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్లాన్ 239 అందుబాటులో ఉంది. ఇందులో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. వ్యాలిడిటీ మాత్రం 24 రోజులే ఉంటుంది.
Also read: Aadhaar Card: పదేళ్లు దాటితే ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించాలా, యూఐడీఏఐ ఏమంటోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook